Weight Loss Drink: వ్యాప్తంగా 40 శాతం మంది ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యతో బాధపడడానికి ప్రధాన కారణాలు ఆధునిక జీవనశైలే కాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు విచ్చలవిడిగా తినడమేనని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం చాలామంది బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ప్రోటీన్ షేక్స్, స్మూతీస్, జ్యూస్‌లు, టీలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కొందరు ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. ఈ ఫలితాలు పొందలేకపోవడానికి ప్రధాన కారణం బరువు తగ్గే క్రమంలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటించకపోవడం. అంతేకాకుండా డైట్ ని పాటించకపోవడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సరైన మార్గంలో సరైన జీవనశైలిని అనుసరించడం వల్ల ఎంతటి శరీర బరువునైనా సులభంగా తగ్గించుకోవచ్చని పలువురు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా డైట్ ని ప్రతి రోజే పాటించి అందులో ముఖ్యమైన పోషకాలున్న ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు. అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. అయితే ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ప్రముఖ వైద్య నిపుణులు సూచిస్తున్న ఓ చిట్కాను మీకు ఈరోజు తెలపబోతున్నాం.
నిమ్మకాయ, చియా గింజలతో తయారు చేసిన ఎఫెక్టివ్ వెయిట్ లాస్ డ్రింక్‌ని ప్రతిరోజు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు అయితే ఈ డ్రింకును ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పానీయానికి కావలసినవి పదార్థాలు:
2 టేబుల్ స్పూన్లు చియా విత్తనాలు
1/2 నిమ్మకాయ రసం
ఒక గ్లాసు వెచ్చని నీరు
1 టేబుల్ స్పూన్ తేనె
పానీయం తయారుచేసే విధానం:
చియా గింజలను నీటిలో 10 నిమిషాలు నానబెట్టండి. నానబెట్టిన గింజలను ఒక గ్లాసులో వేసి అందులో సగం నిమ్మకాయ రసం కలపండి. తర్వాత గ్లాసులో వేడినీరు, ఒక చెంచా తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి తాగాలి. ఈ పానీయాన్ని ప్రతిరోజు ఖాళీ కడుపుతో తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా శరీరంలో కేలరీల పరిమాణాన్ని తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ డ్రింక్ ని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా చేసేందుకు కూడా సహాయపడుతుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
ఇది కూడా చదవండి : Republic Day 2023: రిపబ్లిక్ డే టికెట్ బుకింగ్ ధరలు, చీఫ్ గెస్ట్, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు
ఇది కూడా చదవండి : Parliament New Building Photos: పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ఫోటోలు.. పాతదానికి, కొత్తదానికి డిజైన్ తేడా చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook