Vaccinated People Less Likely To Die Of Covid: కోవిడ్‌ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటే చనిపోయే అవకాశం 11 రెట్లు తక్కువట

Fully Vaccinated People 11 Times Less Likely : వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో దాదాపు  86 శాతం మంది ఆసుప్రతిలో చేరలేదంట. అన్ని వయసుల వారిపై వ్యాక్సిన్ మంచి ప్రభావం చూపించిదట. వ్యాక్సిన్లు రక్షణ కల్పించడంలో సఫలం అయ్యాయట.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 11, 2021, 05:59 PM IST
  • కోవిడ్‌ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటే చాలా మేలు
  • టీకాలు తీసుకోని వారితో పోలిస్తే 10 రెట్లు తక్కువగా ఆసుపత్రిలో చేరే అవకాశం
  • అమెరికా అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు
Vaccinated People Less Likely To Die Of Covid: కోవిడ్‌ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటే చనిపోయే అవకాశం 11 రెట్లు తక్కువట

Fully Vaccinated People 11 Times Less Likely To Die Of Covid: కోవిడ్‌ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో చనిపోయే అవకాశం 11 రెట్లు తక్కువని అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (Center for Disease Control and Prevention) అధ్యయనం వెల్లడించింది. ఇక టీకాలు తీసుకోని వారితో పోలిస్తే 10 రెట్లు తక్కువగా ఆసుపత్రిలో చేరే అవకాశం ఉంటుందని పేర్కొంది. సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ప్రచురించిన మూడు అధ్యయనాలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రచురించిన ఒక అధ్యయనంలో  ఈ విషయాన్ని వెల్లడించారు.

 32,000 మంది రోగులపై అధ్యయనం

జూన్ నుంచి ఆగస్టు వరకు పలు ఆసుపత్రులు, అత్యవసర విభాగాల్లో చేరిన 32,000 మంది రోగులపై అధ్యయనం చేసింది సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌. తర్వాతే ఈ విషయాన్ని వెల్లడించింది. వ్యాక్సిన్లు (vaccine) తీసుకున్న వారిలో దాదాపు  86 శాతం మంది ఆసుప్రతిలో చేరలేదంట. అన్ని వయసుల వారిపై వ్యాక్సిన్ మంచి ప్రభావం చూపించిదట. వ్యాక్సిన్లు రక్షణ కల్పించడంలో సఫలం అయ్యాయట.

Also Read : Side effects of drinking cool drinks: కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతున్నారా ? ఈ Dangerous సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసా ?

మొత్తానికి కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు (two doses) తీసుకుంటే అధిక వయసు వారికి కూడా రక్షణ ఉంటుందని అధ్యయనం స్పష్టం చేసింది. ఆసుపత్రిలో చేరడం, ఐసీయూలో చికిత్స తీసుకోవడం వంటి వాటి నుంచి 82 శాతం కంటే ఎక్కువ మందికి కోవిడ్ వ్యాక్సిన్స్ (Covid Vaccine) రక్షణ కల్పించాయి. సో... కోవిడ్ ఫుల్ వ్యాక్సినేషన్ పూర్తి అయితే మనం కాస్త టెన్షన్ లేకుండా ఉండొచ్చన్నమాట.

Also Read : Vinayaka chavithi 2021: వినాయక చవితి నాడు చంద్రుడిని చూస్తే ఏమవుతుంది ? Mithya Dosha

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News