Uric Acid Control Tips: యూరిక్ యాసిడ్ అనేది ఇటీవల ఓ సమస్యగా మారుతోంది. సాధారణంగా మధ్య వయస్సువారి నుంచి వృద్ధుల వరకూ ఉంటోంది. ప్రత్యేకించి చలికాలంలో ఈ సమస్య మరింతగా పెరగడం ఇబ్బందిగా మారుతోంది.
చలికాలంలో యూరిక్ యాసిడ్ సమస్య పెరుగుతుంది. ఫలితంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. వివిధ రకాల మందులు వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే మీ డైట్‌లో కొన్నిమార్పులు చేస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. దీనికోసం డైట్‌లో కొన్ని పండ్లు తప్పనిసరిగా చేర్చాలి. ఆ వివరాలు మీ కోసం..
యూరిక్ యాసిడ్ సమస్యకు పరిష్కారం ఈ పండ్లు
ఆరెంజ్
ఆరెంజ్‌లో ఉండే విటమిన్ సి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఇ ఫోలేట్, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ను తగ్గించడంలో దోహదపడతాయి. ఫలితంగా యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుంది.
యాపిల్
యూరిక్ యాసిడ్ పెరుగుతుంటే..యాపిల్ తప్పకుండా తినాల్సి ఉంటుంది. ఎందుకంటే యాపిల్‌లో ఫైబర్ చాలా పెద్దమొత్తంలో ఉంటుంది. దీంతో రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గించవచ్చు. యాపిల్ ఎప్పుడూ హెల్తీ ఫుడ్ కేటగరీలోనే ఉంటుంది. అందుకే యాపిల్ మంచి ప్రత్యామ్నాయం అవుతుంది.
కివి
కివీ మరో అద్భుతమైన పౌష్ఠికాహార పండు. యూరిక్ యాసిడ్ రోగులకు అత్యంత ప్రయోజనకరం. విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో ఇమ్యూనిటీని వేగంగా పెంచుతుంది. దాంతోపాటు బ్లడ్ ప్లేట్‌లెట్స్‌ను కూడా నియంత్రిస్తుంది. ఇందులో విటమిన్ సి , విటమిన్ ఇ, ఫోలేట్ ఉంటాయి.
అరటి
ఆరటి పండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. డయాబెటిస్ రోగులు తప్ప అందరికీ మంచిది. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవాళ్లకు ఇది చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ ఫ్రూట్‌లో ప్యూరిన్ తక్కువగా ఉండటంతో గౌవుట్ సమస్య పోతుంది.
Also read: Diet Tips: విటమిన్ డి లోపంతో ఏయే సమస్యలు తలెత్తుతాయి, ఏం తింటే మంచిది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి