Side Effects Of Green Tea: గ్రీన్ టీ ఎక్కువగా తీసుకుంటే కలిగే నష్టాలు ఇవే!

గ్రీన్ టీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గ్రీన్ టీ స్థూలకాయాన్ని తగ్గిస్తుంది ( Obesity) అని చాలా మంది చెప్పడం మనం వినేం ఉంటాం. 

Last Updated : Oct 14, 2020, 10:17 PM IST
    • గ్రీన్ టీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గ్రీన్ టీ స్థూలకాయాన్ని తగ్గిస్తుంది అని చాలా మంది చెప్పడం మనం వినేం ఉంటాం.
    • కానీ దాని వల్ల ఎంత నష్టం కలుగుతుంది అనేది మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఆరోగ్యం కోసం జిమ్ కి వెళ్లేవాళ్లకు గ్రీన్ టీ మరింత మంచిది.
Side Effects Of Green Tea: గ్రీన్ టీ ఎక్కువగా తీసుకుంటే కలిగే నష్టాలు ఇవే!

గ్రీన్ టీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గ్రీన్ టీ స్థూలకాయాన్ని తగ్గిస్తుంది ( Obesity ) అని చాలా మంది చెప్పడం మనం వినేం ఉంటాం. కానీ దాని వల్ల ఎంత నష్టం కలుగుతుంది అనేది మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు.

ALSO READ | Wall Colour for Wealth: గోడలకు ఈ రంగులు వేయడం వల్ల సంపద, ఆరోగ్యం కలుగుతుంది

ఆరోగ్యం ( Health ) కోసం జిమ్ కి వెళ్లేవాళ్లకు గ్రీన్ టీ  మరింత మంచిది. కానీ దాన్ని ఎప్పుడు ఎలా తాగాలి అనేది మాత్రం చాలా మందికి తెలియని విషయం. మీ జీవన విధానంలో ( Lifestyle ) గ్రీన్ టీని ఇలా భాగం చేసుకోండి.

* గ్రీన్ టీని ఖాళీ కడుపుతో తీసుకోరాదు. దీని వల్ల యాసిడిటీ సమస్య వస్తుంది.  

* గ్రీన్ టీలో 25 నుంచి 25 మిల్లీగ్రాముల వరకు కెఫెన్ ఉంటుంది. రోజుకు 4 లేదా 5 సార్లు తాగడం వల్ల మీ శరీరంలోకి కెఫెన్ అధికంగా చేరుతుంది. దీని వల్ల నిద్రలేమి, నీరసం, వ్యాకులత కలిగే అవకాశం ఉంది.

* చాలా మంది గ్రీన్ టీని రెగ్యులర్ టీలాగే తాగుతారు. అలా చేయడం మానేయాలి. ఆహారంతో పాటు గ్రీన్ టీని తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. అందుకే గ్రీన్ టీ తీసుకోవాలి అనుకుంటే  ఐరన్ ఉన్న ఆహారం తీసుకోండి.

*  మందులతో పాటు గ్రీన్ టీ ( Green Tea) తీసుకోవడం వల్ల నెర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. రక్తపోటును కూడా పెంచే అవకాశం ఉంది.

ALSO READ | Good News: ఒక్క రుపాయితో రూ.25 లక్షలు సంపాదించే అవకాశం

* గర్భవతి మహిళలు, పాలిచ్చే తల్లులు గ్రీన్ టీ తాగకపోవడం శ్రేయస్కరం. అది పిల్లలకు హానికలిగిస్తుంది అని కొన్ని పరిశోధనల్లో తేలింది.

* గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు పటుత్వం కోల్పోతాయి. శరీరంలోని క్యాల్షియం పనికి గ్రీన్ టీ ఆటంకం కలిగిస్తుంది.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News