Summer Care for Diabetes: డయాబెటిస్ వ్యాధి ఎంత ప్రమాదకరమో..జాగ్రత్తలు తీసుకుంటే అంతే సులభంగా నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా వేసవిలో డయాబెటిస్ రోగులు మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే బయటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సహజంగానే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఈ క్రమంలో డయాబెటిస్ రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
డయాబెటిస్ వ్యాధికి నియంత్రణే తప్ప శాశ్వత చికిత్స లేదు. అందుకే ప్రతి సీజన్‌లో ముఖ్యంగా వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రపంచంలో వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి ఇది. మధుమేహం ఉన్న వ్యక్తి ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఇలా వివిధ అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
వేసవి కాలంలో డయాబెటిస్ రోగులు తీసుకోవల్సిన జాగ్రత్తలు
వేసవిలో డయాబెటిస్ రోగులు యాక్టివ్‌గా ఉండేట్టు చూసుకోవాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి. యాక్టివ్‌గా ఉండేందుకు ఉదయం కనీసం అరగంటసేపు వాకింగ్ చేయాలి. మరోవైపు రాత్రి నిద్రకు 2 గంటల ముందు భోజనం పూర్తి చేయాలి.
మధుమేహ వ్యాధిగ్రస్థులు డైట్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. తీసుకునే ఆహారంలో ఫైబర్ పదార్ధాలు ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. ఫైబర్ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గించవచ్చు. అందుకే డైట్‌లో పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఆకుపచ్చని కూరగాయలు, టొమాటో చేర్చుకోవాలి.
వేసవికాలంలో ఫిట్ అండ్ ఫ్రెష్‌గా ఉండేట్టు చూసుకోవాలి. స్మూదీ, స్వీట్ జ్యూస్‌కు దూరంగా ఉండాలి. వేసవిలో తాజా పండ్ల జ్యూస్ ఆరోగ్యానికి మంచిదంటారు కానీ డయాబెటిస్ రోగులకు ప్రమాదకరం. అందుకే స్వీట్ ఫ్రూట్స్‌కు దూరంగా ఉండాలి. సాధ్యమైనంతవరకూ సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది.
డయాబెటిస్ రోగులు శరీరాన్ని సాధ్యమైనంతవరకూ హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. డీహైడ్రేషన్ కాకుండా ఎప్పటి కప్పుడు నీళ్లు తాగుతుండాలి. లేదా నీటి శాతం ఎక్కువగా ఉండే బొప్పాయి, కీరా, దోసకాయ వంటివి తినాలి. మధుమేహ వ్యాధిగ్రస్థులకు డీ హైడ్రేషన్ మంచిది కాదు.
Also read: Covid19 Cases in India: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు.. 24 గంటల్లో వేయికి పైగా కేసులు నమోదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook