Summer Drinks: మండుటెండల నుంచి రక్షణ పొందేందుకు ఈ పానీయాలు తాగండి!

Summer Drinks: ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవ్వనున్నాయని భారత వాతావరణ శాఖ ఇటీవలే ప్రకటించింది. ఏప్రిల్ నెలలోకి ప్రవేశించక ముందే అధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఈ క్రమంలో ఎండల నుంచి మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పండ్ల రసాలు తాగడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2022, 07:05 PM IST
Summer Drinks: మండుటెండల నుంచి రక్షణ పొందేందుకు ఈ పానీయాలు తాగండి!

Summer Drinks: వేసవి కాలం రానే వచ్చింది. మార్చి నెల మొదటి వారం నుంచే తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇకపై రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఎండలు మండే అవకాశం ఉందని వాతవరణ శాఖ అభిప్రాయపడింది. అయితే అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. అందువల్ల వేసవిలో ఎక్కువ నీరు శాతం కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. ఈ క్రమంలో ఎండల్లో వడదెబ్బ నుంచి దూరంగా ఉండేందుకు కొన్ని పానీయాలు తాగితే మంచిదని వైద్యులు చెబుతున్నారు. 

వేసవిలో ఉత్తమ పానీయాలు..

1) నిమ్మకాయ రసం

భారతదేశంలో ఎండల కాలంలో నిమ్మరసాన్ని తాగేందుకు ఎక్కువ మంది ప్రజలు ఆసక్తి చూపుతారు. నిమ్మరసం తాగడం వల్ల అధిక దాహాన్ని తీర్చవచ్చు. దాంతో పాటు నిమ్మరసంలోని అనేక విటమిన్లు శరీరానికి ప్రయోజనాలు చేకూరుస్తాయి. లెమన్ వాటర్ తాగడం వల్ల శరీరాన్ని డీహైడ్రేడ్ సమస్య నుంచి దూరం చేయవచ్చు. 

2) చల్లని పిప్పరమెంట్ జ్యూస్

వేసవిలో పిప్పరమెంటు మార్కెట్లో ఎక్కువగా విక్రయిస్తారు. పుదీనా కూడా చాలా ప్రయోజనకరంగా మారుతుంది. పుదీనా జ్యూస్ తాగడం వల్ల కడుపులో మంట, జ్వరం, వాంతులు వంటి సమస్యలు దూరం చేయవచ్చు. దీంతో పాటు పుదీనా రసం లేదా పానకం తాగడం వల్ల కడుపులో ఆందోళనను దూరం చేయవచ్చు. 

3) పండ్ల రసాలు..

పండ్ల రసాలు ఆరోగ్యానికి చాలా మంచిదని ఎక్కడో అక్కడ వినే ఉంటాం. అయితే వేసవిలో పండ్ల రసాలను తరుచూగా తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. వీటి వల్ల శరీరానికి తగిన నీటి శాతం అందడం సహా తక్షణ శక్తిని ఇస్తాయి. వేసవిలో నారింజ, కర్భూజ, యాపిల్స్ వంటి సీజనల్ ఫ్రూట్స్ తాగడం వల్ల శరీరానికి విటమిన్స్ కూడా లభ్యమవుతాయి.   

Also Read: Coconut Water Benefits: ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగితే హైబీపీతో పాటు అనేక సమస్యలకు ఫుల్ స్టాప్!

Also Read: Knee Pain Remedies: ఈ పండ్లు తింటే కీళ్ల నొప్పులు, వాపులు తప్పకుండా తగ్గుతాయి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News