Stroke Signs: ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో అత్యధిక శాతం మరణాలకు కారణం గుండె వ్యాధులే. హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటివి ప్రాణాంతకంగా మారాయి. నిజంగానే ఇదొక ప్రమాదకర పరిస్థితి. అందుకే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండాలంటే హార్ట్ ఎటాక్ లక్షణాలు ఇతర వివరాలు తెలుసుకోవాలి.
స్ట్రోక్ అనేది అత్యంత ప్రమాదకరమైంది. ఈ పరిస్థితిలో శరీరంలోని సగం భాగంలో ఇబ్బంది తలెత్తవచ్చు. అయితే వైద్య నిపుణుల ప్రకారం ఎలాంటి గుండె పోటు వ్యాధి అయినా ముందస్తుగా కొన్ని లక్షణాలు లేదా సంకేతాలను ఇస్తుంది. సహజంగా చాలామంది వీటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ లక్షణాల్ని త్వరగా గుర్తించగలిగితే చాలావరకూ రికవరీ పొందవచ్చు. హార్ట్ స్ట్రోక్‌ను ముందుగా గుర్తిస్తే రోగిని త్వరగా కోలుకునేలా చేయవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా గోల్డెన్ అవర్ గురించి తెలుసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. గోల్డెన్ అవర్ అంటే స్ట్రోక్ రావడానికి గంట ముందు కన్పించే లక్షణాలను వేగంగా ఎదుర్కోవడం. ఈ విపత్కర పరిస్థితిలో వైద్య సహాయం ఇవ్వడం ద్వారా బ్రెయిన్ డ్యామేజ్ ముప్పును చాలా వరకూ తగ్గించవచ్చు.
స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయి
ముఖంలోని ఓ భాగం తిమ్మిరెక్కి ఉంటుంది లేదా పని చేయకుండా పోతుంది. లేదా సరిగ్గా పనిచేయకపోవచ్చు. దీనినే ఫేస్ డ్రూపింగ్ అంటారు. రెండవది చేతులు బలహీనంగా ఉండటం లేదా తిమ్మిరెక్కడం. ఇలా కన్పిస్తే నిర్ధారణకు రెండు చేతులు పైకి లేపించాలి. ఈ సమయంలో ఓ భుజం కిందికి జారుతుందేమో గమనించాలి. అంటే పైకి లేపడంలో ఇబ్బంది తలెత్తడం.
ఎవరికైనా ఒక్కసారిగా మాట్లాడటంలో ఇబ్బంది కలిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు. అంటే స్పీచ్ డిఫికల్టీ. మీరెప్పుడైనా ఎవరిలోనైనా ఈ లక్షణాలు గమనిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. ఒకవేళ ఈ లక్షణాలు అప్పటికప్పుడు పోయినా సరే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇంకా తలనొప్పి, నడవడంలో ఇబ్బంది, తల తిరగడం, మతి స్థిమితం లేకపోవడం వంటి లక్షణాలున్నా నిర్లక్ష్యం వహించకూడదు.
స్ట్రోక్‌కు చెందిన ఈ లక్షణాల్ని గుర్తించి వెంటనే వైద్య సహాయం అందించడమే గోల్డెన్ అవర్‌లో చేయాల్సిన పని. తక్షణం ఈ లక్షణాల్ని పసిగట్టి చికిత్స ప్రారంభించాలి. ఈ చికిత్సలో టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్, మెకానికల్ క్లాట్ రిమూవల్ వంటి వైద్య పద్ధతులుంటాయి. వీటి సహాయంతో రక్త సరఫరా తిరిగి సాధారణంగా ఉండేట్టు చేయవచ్చు.
Also read: Dangerous Diseases: ఈ ఫుడ్స్ తినడం వల్లనే 32 రకాల ప్రమాదకర వ్యాధులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook