దేశంలో వర్షాకాలం పూర్తి కావచ్చింది. చలికాలం ప్రారంభం కానుండటమే కాకుండా..అప్పుుడే దేశంలో చలిగాలులు వీస్తున్నాయి. చలికాలం ప్రారంభం కాగానే..సీజనల్ వ్యాధులు ప్రారంభం కావచ్చు. ఈ ఇబ్బందుల్నించి ఎలా గట్టెక్కడం అనేది చాలా ముఖ్యం.
సీజన్ మారగానే సీజనల్ వ్యాధుల ముప్పు అధికమౌతుంది. అదే సమయంలో ఆరోగ్యపరంగా కొంత మంచి కూడా జరుగుతుంది. లేదా సమస్యలకు గురికావచ్చు. చలికాలం అనేది చర్మ ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ సీజన్లో వివిధ రకాల చర్మ సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యల్నించి గట్టెక్కేందుకు వివిధ రకాల ఉత్పత్తులు వినియోగిస్తుంటారు. ఇవి ఖరీదైనవే కాకుండా..సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సాధారణంగా చలికాలంలో ఎక్కువగా ఉపయోగించే లోషన్, క్రీమ్ వంటివి ఎక్కువసేపు చర్మాన్ని డ్రై కాకుండా ఉంచలేవు. కొన్ని సహజసిద్ధమైన క్రీమ్స్ సహాయంతో ఈ సమస్య నుంచి దూరం కావచ్చు.
బాదం అలోవెరా స్కిన్ క్రీమ్ లాభాలు
బాదం-అలోవెరాలో చాలా రకాల పోషకలుంటాయి. చర్మ సంరక్షణకు ఇవి చాలా మంచిది. ఇవి చర్మం డ్రై కాకుండా చేస్తాయి. చర్మం దెబ్బతినకుండా చేయడంలో దోహదపడతాయి. అలోవెరా చర్మంలోని తేమను కొనసాగిస్తుంది. చర్మం మాయిశ్చరైజర్ స్థాయి సరిగ్గా ఉంటుంది. బాదం-అలోవెరా వాడటం వల్ల చలికాలంలో కూడా చర్మం నిగారింపుతో, కళకళలాడుతుంటుంది. చలికాలం సమయంలో చర్మంలో మంట, దురద సహా చాలా సమస్యలు తలెత్తుతాయి. నేచురల్ క్రీమ్ ఈ సమస్యను దూరం చేస్తుంది.
బాదం-అలోవెరా క్రీమ్ ఎలా తయారు చేయాలి
ఈ క్రీమ్ తయారీకు పది బాదం పిక్కల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఉదయం వాటిని పేస్ట్‌గా చేసుకోవాలి. ఓ గిన్నెలో 2 స్పూన్స్ అలోవెరా జ్యూస్ తీసుకుని అందులో బాదం పేస్ట్ కలపాలి. ఇందులో విటమిన్ క్యాప్యూల్స్ జెల్ 2-3 వేయాలి. అంతే మీ నేచురల్ క్రీమ్ సిద్దమైనట్టే. ఇందులో రోజ్ వాటర్ కూడా కలపవచ్చు.
సహజంగా చాలామంది ఎండాకాలంలో తాగినంతగా చలికాలంలో నీళ్లు తాగరు. ఈ పొరపాటు చర్మం డ్రైనెస్‌కు కారణమౌతుంది. అందుకే నీళ్లు తాగడానికి సీజన్ సంబంధం లేదు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా 7-8 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాల్సిందే. బాడీలో నీరు తగిన మోతాదులో ఉంటే కచ్చితంగా చాలావరకూ చర్మ సమస్యలు దూరమౌతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook