Side Effects of Tea: ఛాయ్‌తోనూ డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్.. ప్రాణానికే ముప్పు తెచ్చే ఛాయ్

Side Effects of Tea Addiction: ఛాయ్‌ని ఛాయ్‌లా కాకుండా ఒక వ్యసనంలా మార్చుకుంటే అందువల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని.. ఛాయ్ కూడా ఆరోగ్యానికి హానికరమే అంటే నమ్ముతారా ? నిస్సందేహంగా నమ్మితీరాల్సిందే. ఎందుకంటారా ? అయితే, ఇదిగోండి ఫుల్ డీటేల్స్.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 25, 2023, 05:41 AM IST
Side Effects of Tea: ఛాయ్‌తోనూ డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్.. ప్రాణానికే ముప్పు తెచ్చే ఛాయ్

Side Effects of Tea Addiction: చాలామందికి ఛాయ్ తాగడం అనేది ఒక సర్వసాధారమైన అలవాటు. పొద్దున్నే నిద్ర లేవగానే ఒక కప్పు ఛాయ్ తాగాకే ఏ పని అయినా మొదలుపెట్టడం వీరికి ఉండే అలవాటు. ఇంకొంతమందికి ఛాయ్ అనేది కూడా ఆల్కాహాల్ తరహాలోనే ఒక వ్యసనం. ఉదయం నిద్ర లేచింది మొదలు పడుకునే రాత్రి వరకు ఎన్నిసార్లు, ఎన్ని ఛాయలు తాగుతారో వారికే సరిగ్గా లెక్క తెలియదు. సిగరెట్ తాగే వారికి ఈ అలవాటు ఇంకొంచెం ఎక్కువే ఉండటం మీరు కూడా గమనించే ఉంటారు. కానీ ఛాయ్‌ని ఛాయ్‌లా కాకుండా ఒక వ్యసనంలా మార్చుకుంటే అందువల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని.. ఛాయ్ కూడా ఆరోగ్యానికి హానికరమే అంటే నమ్ముతారా ? నిస్సందేహంగా నమ్మితీరాల్సిందే. ఎందుకంటారా ? అయితే, ఇదిగోండి ఫుల్ డీటేల్స్.

కెఫైన్ వినియోగం
టీ పొడిలో కెఫైన్ ఉంటుంది. కెఫైన్ అధిక మోతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అంతేకాకుండా తరచుగా ఛాయ్ తాగడం వల్ల ఇందులో ఉండే కెఫైన్ మిమ్మల్ని బానిసను చేస్తుంది. అంటే.. చివరకు ఛాయ్ లేకపోతే మీరు ఉండలేని పరిస్థితి వస్తుంది. అందుకే ఛాయ్ బాగా తాగే అలవాటు ఉన్న వారిలో చాలామందికి సమయానికి ఛాయ్ లేకపోతే పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తుంటారు. తలనొప్పి, చేతులు వణకడం, కళ్లు తిరిగినట్టుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఒక కప్పు ఛాయ్ తాగాకే వారు రిలాక్స్ అవుతారు. అంటే... ఛాయ్ అనేది తాగే వారికి కూడా తెలియకుండానే వారిని తనకు బానిసలను చేసుకుంటుందన్నమాట.

నిద్ర లేమి
ఛాయ్ లో ఉండే కెఫైన్ ని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల నిద్ర పట్టదు. అది క్రమక్రమంగా నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. రాత్రి వేళ హాయిగా నిద్ర పట్టాలంటే.. సాయంత్రం తరువాత ఛాయ్ తాగే అలవాటుకు దూరంగా ఉండటం మంచిది.

జీర్ణ శక్తిపై దుష్ప్రభావం
ఎక్కువగా ఛాయ్ తాగే వారిలో జీర్ణ శక్తికి సంబంధించిన సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా కడుపులో నొప్పిగా ఉండటం, ఎసిడిటి, ఉబ్బరం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. 

గుండెకు పొంచి ఉన్న ముప్పు
ఛాయ్ లో ఉండే కెఫైన్ గుండెపైనాస రక్తపోటుపైనా అధిక ప్రభావం చూపిస్తుంది. కెఫైన్ అధిక మోతాదులో తీసుకోవడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అంతేకాకుండా రక్తపోటు కూడా పెరుగుతుంది. హార్ట్ పేషెంట్స్ కెఫైన్ తీసుకోవడం అనేది లైఫ్ రిస్క్ చేయడమే అవుతుంది అనే విషయం మర్చిపోవద్దు.

ఆందోళన, టెన్షన్ టెన్షన్

ఐరన్ లోపం

దంతాల రంగు మాయం

ఎముకల ఆరోగ్యంపైనా ప్రభావం

విత్‌డ్రావల్ సింప్టమ్స్

ఆర్థిక భారం

Trending News