చాలా మందికి మధ్యాహ్నం భోజనం చేశాక చిన్న కునుకు (NAP)తీస్తే బాగుంటుంది అనుకుంటారు. వాస్తవానికి మధ్యాహ్నం తిన్న తర్వాత నిద్ర వచ్చే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ నిద్ర ఆరోగ్యానికి శ్రేయస్కరమా లేక హాని చేస్తాయా అంటే ఈ విషయాలు తెలుసుకోవాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత కాస్త కునుకు తీస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ అంటున్నారు. అయితే మధ్యాహ్నం కునుకు తీస్తే రాత్రి నిద్రరాదేమోనని కొందరు భావిస్తారని, అది కేవలం అపోహ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి సెలబ్రిటీల న్యూట్రిషనిస్ట్ రుజుత ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ని వివరాలతో పోస్ట్ చేశారు.
అన్ని మతాల్లోనూ మధ్యాహ్నం కాస్త కునుకుతీస్తే మంచిదేనని ప్రస్తావన ఉందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. మధ్యాహ్నం నిద్రతో ఎంతో మానసిక ప్రశాంతత లభించి తాను ఎన్నో విజయాలు సాధించానని సాకర్ స్టార్ రొనాల్డో ఎన్నో సందర్బాలలో పేర్కొన్నారని తెలిపారు. ఈ నిద్ర వల్ల షుగర్, థైరాయిడ్ వచ్చే అవకాశాలు తగ్గుతాయన్నారు. హార్మోన్లు చురుగ్గా పనిచేస్తాయని తద్వారా జీర్ణక్రియ సాఫీగా ఉంటుందని, స్థూలకాయం లాంటి సమస్యలను సులువుగా అధిగమించవచ్చు.
Also Read: మితిమీరిన తిండి, వ్యాయామం ఆరోగ్యానికి చేటు.. షాకింగ్ నిజాలు
మధ్యాహ్నం నిద్ర వల్ల ప్రయోజనాలు:
హార్మన్ల సమతౌల్యత పెరుగుతుంది. తద్వారా డయాబెటిస్, పీసీఓడీ, థైరాయిడ్ సమస్యల నుంచి బయటపడవచ్చు.
జీర్ణక్రియ మెరుగవుతుంది
హైబీపీని నియంత్రిస్తుంది.
కొవ్వును కరుగుతుంది
రాత్రివేళలో కంటినిండా నిద్ర వస్తుంది
స్థూలకాయ సమస్య నుంచి బయటపడవచ్చు
అనారోగ్యం నుంచి కోలుకునేందుకు ఉపకరిస్తుంది.
ఎంత సమయం నిద్రించాలి:
చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు గరిష్టంగా 90 నిమిషాలపాటు నిద్ర శ్రేయస్కరం.
ఆరోగ్యవంతులు, సాధారణ వ్యక్తులైతే 10 నుంచి గరిష్టంగా 30 నిమిషాలు కునుకు తీయడం ఆరోగ్యానికి మేలు
ఎలా నిద్రించాలి
గర్భంలో శిశువు ఉండే మాదిరిగా ముడుచుకుని పడుకోవాలి. అయితే ఎడమవైపు తిరిగి నిద్రిస్తే (వామకుక్షి పొజిషన్) అధిక ప్రయోజనం ఉంటుందని రుజుతా దివేకర్ అభిప్రాయపడ్డారు.
Also Read: మగవారిలో రొమ్ము క్యాన్సర్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
సరైన సమయం
మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య నిద్రించాలి.
ఎక్కడ నిద్రించాలి
ఇంట్లో ఉన్నవారైతే మంచం మీద పడుకోవాలి. ఆఫీసులో ఉన్నవారైతే డెస్క్ మీద తలవాల్చి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. లేని పక్షంలో కుర్చీలో కూర్చొని ప్రశాంతంగా కళ్లు మూసుకోవాలి.
భోజనం తర్వాత చేయకూడని పనులు
తిన్న వెంటనే టీ, కాఫీ తాగడం, స్మోక్ చేయడం, చాక్లెట్లు తినడం లాంటివి చేయకూడదు
ఫోన్‌లో వీడియోలు, మెస్సేజ్‌లు చూసి ఎక్కువ ఎక్సైజ్ అవ్వరాదు
టీవీ చూస్తూనే నిద్రలోకి జారుకోవడం చేయరాదని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజుత దివేకర్ తన పోస్ట్‌లో సూచించారు.
లంచ్ తర్వాత నిద్రపోతే లాభమా.. నష్టమా?