Ramadan 2023: రంజాన్ ఉపవాసాల్లో డయాబెటిస్ రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఏం తినాలి..?

Ramadan 2023: రంజాన్ నెల సమీపించింది. ఇండియాలో ఎల్లుండి నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కావచ్చు. రోజంతా కఠిన ఉపవాస దీక్షలు ఆచరించనుండటంతో..మధుమేహ వ్యాధిగ్రస్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 21, 2023, 07:12 PM IST
Ramadan 2023: రంజాన్ ఉపవాసాల్లో డయాబెటిస్ రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఏం తినాలి..?

Precautions & Diet for Diabetes During Ramadan: రంజాన్ నెల వచ్చిందంటే చాలు ముస్లింలంతా రోజంతా కఠిన ఉపవాస దీక్షలు ఆచరిస్తుంటారు. పచ్చి మంచి నీళ్లు కూడా తాగకుండా 12-13 గంటలుండాల్సిన పరిస్థితి. మరి డయాబెటిస్ రోగులు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది పరిశీలిద్దాం.

రంజాన్ నెలకు ముస్లింలకు అత్యంత పవిత్రమైంది. ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం ప్రజానీకం ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. అంటే సూర్యోదయానికి ముందు నుంచి సూర్యాస్తమయం వరకూ కనీసం మంచి నీళ్లు కూడా తాగకుండా కఠిన ఉపవాస దీక్ష ఆచరిస్తారు. పగలంతా ఉపవాసం ఆచరించాక సాయంత్రం దీక్ష విడవడాన్ని ఇఫ్తార్ అంటారు. ఇఫ్తార్ సమయంలో వివిధ రకాల పసందైన వంటలు, పండ్లు ఉంటాయి. ఇండియా వంటి ట్రాపికల్ దేశాల్లో ఉపవాస సమయం 12-13 గంటలుంటుంది. ఈ నేపధ్యంలో డయాబెటిస్ నియంత్రణకు రంజాన్ నెలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సహరి, ఇఫ్తార్ మధ్య సుదీర్ఘ సమయం ఏం తినకుండా ఉండాల్సి వస్తున్నందున తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. అందుకే రంజాన్ నెలలో డయాబెటిస్ రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

తగిన నిద్ర..

ఆరోగ్యం బాగుండాలంటే మంచి నిద్ర అవసరం. రంజాన్ సమయంలో ఉదయం సహరీ సమయంలో తీసుకునే భోజనం అత్యంత మహత్వపూర్వకంగా ఉంటుంది. దీనికోసం తగిన నిద్ర అవసరం. నిద్ర తగినంతగా ఉంటే మెటబోలిజం కూడా బాగుంటుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. 

ఎనర్జీ కోసం సహరీలో ఏం తినాలి..

సహరీలో సాధ్యమైనంతవరకూ ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. దీనివల్ల శరీరానికి క్రమక్రమంగా ఎనర్జీ అందుతుంది. ఓట్స్, మల్టీగ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ రైస్, కూరగాయలు, పప్పులు వంటివి ఉదయం సహరీలో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఎనర్జీ కోసం చేపలు, డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి. తృణ ధాన్యాలు తీసుకోవాలి. కాఫీ, సాఫ్ట్ డ్రింక్స్ వంటివాటికి దూరంగా ఉండాలి.

ఇఫ్తార్ సమయంలో సరైన ఆహారం..

ఉపవాసాన్ని ఎప్పుడూ సాంప్రదాయపద్దతిలో ఖర్జూరం, పాలతో విడుస్తారు. వీటిని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌తో ఫాలో చేయవచ్చు. దాంతోపాటు హైడ్రేట్‌గా ఉండటం అవసరం. స్వీట్స్, ఆయిల్  పదార్ధాలను తగ్గించాలి. ఎందుకంటే ఇవి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తాయి. రాత్రి పడుకునేముందు పండ్లు తీసుకుంటే ఉదయం వరకూ బ్లడ్ షుగర్ లెవెల్ నియంత్రిస్తాయి.

Also Read: Ramadan 2023 Date: ఇండియాలో రంజాన్ నెలవంక ఎప్పుడు, ఉపవాసాలు ఎప్పట్నించి

Also Read: Ramadan 2023: రంజాన్ ఉపవాసాల్లో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎవరికి మినహాయింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News