Radish Health Benefits: శరీరాన్ని ఫిట్‌గా మార్చుకోవడానికి చాలా మంది తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం చాలా మంది ఆధునిక జీవనశైలి కారణంగా వస్తున్న అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని రోజువారీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లను తీసుకుంటున్నారు. అయితే ప్రతి రోజు వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండడమే కాకుండా జీర్ణక్రియ సమస్యలు కూడా దూరమవుతాయి. ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు ప్రతి రోజు ముల్లంగిని తీసుకోవడం వల్ల శరీరానికి ప్రొటీన్, విటమిన్ ఎ, ఐరన్, అయోడిన్, కాల్షియం లభిస్తాయి. అంతేకాకుండా వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల లెక్కలేనీ ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
అధిక మోతాదులో ఫైబర్ లభిస్తుంది:
ముల్లంగిలో ఫైబర్ అధికంగా లభిస్తుంది..కాబట్టి ప్రతి రోజు దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా మలబద్ధకం, గ్యాస్ సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు సలాడ్స్‌లో తీసుకోవచ్చు.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది:
ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. దీని కారణంగానే చాలా మందిలో గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి రోజు ముల్లంగిని తీసుకోవడం వల్ల చాలా రకాల లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరానికి విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్‌లు లభిస్తాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
హైబీపీ సమస్యలకు చెక్:
ముల్లంగిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో పొటాషియం కూడా లభిస్తుంది. కాబట్టి అధిక రక్తపోటును నియంత్రించేందుకు కూడా సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
ముల్లంగిలో విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో పాటు జలుబు, దగ్గు, ఇతర అంటు వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.
చర్మానికి మేలు చేస్తుంది:
ముల్లంగిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు ముల్లంగిని తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది. అంతేకాకుండా చర్మం మెరిసేలా తయారవుతుంది. ముల్లంగిలో విటమిన్ సి, ఫాస్పరస్, జింక్ వంటి అనేక పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ముల్లంగి తీసుకోవడం వల్ల మొటిమలు, చర్మం పొడిబారడం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి