కరోనా వైరస్ ( Corona virus ) ప్రపంచాన్నివణికిస్తోంది. రోజురోజుకూ కొత్త కొత్త కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. తాజాగా నోటిపూత ఉన్నా సరే...కరోనా వైరస్ కాదని చెప్పలేమంటున్నారు వైద్య నిపుణులు.
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకుని 7-8 నెలలు కావస్తున్నా..ఇంకా కచ్చితమైన లక్షణాల్ని గుర్తించలేకపోతున్నారు. కొత్త కొత్త లక్షణాలు బయటపడుతుండటంతో జనం భయపడిపోతున్నారు. ఈ నేపధ్యంలో కాస్త జలుబు చేసినా లేదా..జ్వరం వచ్చినా కంగారు పడాల్సిన పరిస్థితులు. ఏదో కరోనా ( Corona ) నో..ఏది ఫ్లూ జ్వరమో అర్దం కాని పరిస్థితి. ఈ నేపధ్యంలో నోటిపూత ( Mouth ulcer ) ఉన్నాసరే తోసిపుచ్చకూడ దంటున్నారు వైద్య నిపుణులు. వాస్తవానికి కరోనా వైరస్ ప్రారంభమైన సమయంలో అయితే జ్వరం, జలుబు, గొంతునొప్పి, శ్వాస సంబంధ ఇబ్బందులే ప్రధాన లక్షణాలుగా భావించారు. కానీ క్రమేణా కొత్త లక్షణాలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు నోటిపూత వచ్చి చేరుతోంది. నాలుకపై మంటగా ఉన్నా...నోటిపూత పూసినా...లైట్ గా తీసుకోలేని దుస్థితి ఏర్పడింది. నోటిపూతను కరోనా లక్షణంగా భావించవచ్చా అంటే అవుననే అంటున్నారు వైద్య నిపుణులు. అయితే నోటిపూతతో పాటు ఏ ఒక్క కరోనా ఇతర లక్షణమున్నా కరోనా కావచ్చని...ఏ ఇతర లక్షణాలు ( other symptoms ) లేకపోతే కరోనా వైరస్ కాదని మాత్రం స్పష్టం చేస్తున్నారు.
ఆ లక్షణాలివే..
ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు
గొంతులో నొప్పి, డయేరియా
కండ్ల కలక, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు లేదా కాలివేళ్లపై రంగు మారడం
కరోనా లక్షణాలు తీవ్రంగా ఉంటే శ్వాస తీసుకోలేరు. ఛాతిలో నొప్పి లేదా ఒత్తిడి అధికంగా ఉంటుంది. మాట్లాడలేరు..కదల్లేరు. పైకి లేవలేరు. ఈ లక్షణాలుంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యున్నిసంప్రదించాల్సిందేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. Also read: Vitamin D: అతిగా వాడినా ప్రమాదమే..డాక్టర్ ను సంప్రదించండి
Corona Symptoms: నోటిపూత...కరోనా కొత్త లక్షణమిదే