Monsoon Drinks: వర్షాకాలంలో వీటిని తప్పకుండా తాగాలి.. ఇవీ శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షింస్తుంది..!

Monsoon Drinks: ప్రస్తుతం ఎండాకాలం వెళ్లిపోయి వాన కాలం మొదలైంది. వర్షకాలం అంటే చాలా మందికీ ఇష్టం ఉంటుంది. కొందరు ఈ సమయాల్లో టీ, పకోడీతో ఎంజాయ్‌ చేస్తూ ఉంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 27, 2022, 03:40 PM IST
  • వర్షాకాలంలో గ్రీన్ టీని తప్పకుండా తాగాలి..
  • శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షింస్తుంది
  • ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి
Monsoon Drinks: వర్షాకాలంలో వీటిని తప్పకుండా తాగాలి.. ఇవీ శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షింస్తుంది..!

Monsoon Drinks: ప్రస్తుతం ఎండాకాలం వెళ్లిపోయి వాన కాలం మొదలైంది. వర్షకాలం అంటే చాలా మందికీ ఇష్టం ఉంటుంది. కొందరు ఈ సమయాల్లో టీ, పకోడీతో ఎంజాయ్‌ చేస్తూ ఉంటారు. ఈ సీజన్‌లో ఏదైనా తినాలనే కోరికలు ఎక్కుగా అవుతాయి. అంతేకాకుండా  వీటిని అతిగా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై  ప్రభావం పడే అవకాశాలుంటాయి. ఇదే క్రమంలో వాంతులు, విరేచనాలు, ఇన్ఫెక్షన్, జ్వరం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి బలహీనపడటం జరుగుతుంది. ఈ సమస్య నుంచి విముక్తి పొందడాని వాన కాలంలో ఎప్పటికప్పుడు డిటాక్స్ చేయడం చాలా మంచిది. అయితే దీని కోసం పలు రకాల చిట్కాలను పాటించాలని నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శరీరాన్ని డిటాక్స్ ఎలా చేసుకోవాలి?

శరీరలోని టాక్సిన్స్‌ను తొలగించడానికి సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా.. పొగాకు, మద్యం, సిగరెట్లను వదులుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వేయించిన ఆహారాలు, చక్కెర, సంతృప్త కొవ్వులు, ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోకపోవడం మంచిదని వారు భావిస్తున్నారు.

వర్షాకాలంలో ఈ ఆహారాలను అప్పుడప్పుడు తీసుకోవాలి:

#పాల ఉత్పత్తులు
#గుడ్లు
#చక్కటి పిండి వంటలు
#శీతల పానీయాలు, చాక్లెట్లు
#ఫాస్ట్ ఫుడ్
#స్వీట్లు, కేకులు, పేస్ట్రీలు
#వేయించిన ఆహారాలు
#తోపుడు బండి ఆహారం

ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి:

గ్రీన్ టీ:

గ్రీన్ టీ రీరం నుంచి టాక్సిన్స్‌ను బయటకు పంపి.. చర్మాన్ని తిరిగి కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది. ఇది ఇన్ఫెక్షన్లు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలను దూరం చేస్తాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్ కిడ్నీలకు చాలా మేలు చేస్తుంది. ఒకటి, రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను రెండు లీటర్ల నీటిలో వేసి రోజంతా తాగండి.

నిమ్మ, పుదీనా నీరు:

నిమ్మ, పుదీనా నీరు శరీరంలో విటమిన్ సి స్థాయిలను తక్షణమే పెంచేందుకు దోహదపడుతుంది. వ్యాధి సంక్రమణతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది.

కొబ్బరి నీరు:

కొబ్బరి నీరును నేచురల్ డిటాక్స్ డ్రింక్‌గా పిలుస్తారు. ఇది శరీరాన్ని ఎల్లప్పుడు హైడ్రేట్ గా ఉంచేందుకు కృషి చేస్తుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరిచేందుకు కృషి చేస్తుంది.

Also Read: Mango Peels Benefits: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఇలా మామిడి తొక్కతో ఉపశమనం పొందండి..!

Also Read:  Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ పండ్లను తప్పకుండా తీసుకుంటే.. ఎలాంటి వ్యాధులు మీ చుట్టుముట్టవు..!

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News