WHO about Monkeypox : మంకీపాక్స్‌ని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్

Monkeypox, A Global Health Emergency: మంకీపాక్స్ వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్‌ని ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణిస్తున్నట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెసెస్ ఈ ప్రకటన చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 23, 2022, 09:04 PM IST
WHO about Monkeypox : మంకీపాక్స్‌ని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్

Monkeypox, A Global Health Emergency: మంకీపాక్స్ వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్‌ని ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణిస్తున్నట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెసెస్ ఈ ప్రకటన చేశారు. ఇదే మంకీపాక్స్‌పై జూన్ నెలలో టెడ్రోస్ స్పందిస్తూ.. మంకీపాక్స్‌పై ఆందోళన వ్యక్తంచేసినప్పటికీ, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేంత అవసరం మాత్రం లేదని అభిప్రాయపడ్డారు. కానీ ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మంకీపాక్స్ కేసులు అధికంగా పెరుగుతుండటంతో తాజా పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు గురువారమే నిపుణుల బృందంతో ఎమర్జెన్సీ కమిటీని ఏర్పాటు చేశారు. 

మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంపై టెడ్రోస్ ఏర్పాటు చేసిన ఎక్స్‌పర్ట్స్ కమిటీ 'పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ'పై ఒక ఏకాభిప్రాయానికి రానప్పటికీ.. ప్రపంచ దేశాల్లో కేసులు పెరుగుతున్నందున టెడ్రోస్ మాత్రం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ వైపే మొగ్గుచూపారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) చేసిన హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటనతో ప్రపంచ దేశాలు మరోసారి అప్రమత్తమయ్యాయి.

Also Read : Monkeypox Symptoms: మంకీపాక్స్ ప్రాణాంతకమా? దాని లక్షణాలు ఏంటి? మంకీపాక్స్ కు వ్యాక్సిన్ ఉందా?

Also Read : Monkeypox Cases: షాకింగ్.. మంకీపాక్స్ వ్యాధి సోకినవారిలో 98 శాతం మంది గే లేదా బైసెక్సువల్..

Trending News