మహిళల్లో పీరియడ్స్ మిస్ కావడమనే సమస్య ఇటీవలి కాలంలో ఎక్కువగా కన్పిస్తోంది. దీనివెనుక కొన్ని బలమైన కారణాలే ఉన్నాయి. పీరియడ్స్ ఎందుకు మిస్సవుతున్నాయనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి.
ఈ సమస్య నిజంగా గంభీరమైంది. ఎందుకంటే పీరియడ్స్ ఎప్పుడు మిస్సైనా మహిళలకు చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. పీరియడ్స్ అనేది మహిళల జీవితంలో ఓ భాగం. ప్రతి నెలా ఎదుర్కోవల్సిన సమస్య ఇది. అయితే పీరియడ్స్ సమయానికి రాకుండా అటూ ఇటూ అయితే జీవితంపై ప్రభావం పడుతుంటుంది. పీరియడ్స్ మిస్ అవడం వెనుక కారణాలేంటనేది తెలుసుకోవాలి.
పీరియడ్స్ ఎందుకు మిస్ అవుతుంటాయి
1. మహిళల శరీరంలో ఎప్పుడు హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పినా..పీరియడ్స్ మిస్ అవుతాయి. హార్మోన్ బ్యాలెన్స్ సరిగ్గా లేకుంటే పీరియడ్స్ మిస్ అయ్యే సమస్య పెరుగుతుంటుంది. అందుకే హార్మోన్ బ్యాలెన్స్ చాలా ముఖ్యం.
2. పీసీఓఎస్ అంటే పోలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ కారణంతో కూడా మహిళల్లో పీరియడ్స్ మిస్ అవుతుంటాయి. ఈ సమస్య మహిళ గర్భిణీగా ఉన్నప్పుడు కూడా కావచ్చు. ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
3. మహిళలు తరచూ వినియోగించే మందుల వల్ల కూడా పీరియడ్స్ మిస్ అవుతుంటాయి. ఈ పరిస్థితుల్లో ముందుగా అలాంటి మందుల గురించి తెలుసుకోవాలి. ఉదాహరణకు థైరాయిడ్ మంందులు తీసుకునే అలవాటుంటే..పీరియడ్స్ మిస్ అవుతుంటాయి. ఈ సమస్య ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
4. ప్రెగ్నెన్సీలో మహిళలకు ఈ సమస్య ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీ ఉందో లేదో ముందుగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
Also read: Diabetes Symptoms: ఉదయం లేచిన వెంటనే ఈ లక్షణాలు కన్పిస్తే ఆ వ్యాధి కావచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook