Memory Booster Drink: వయస్సు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో చిన్నతనంలోనే జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలతో వస్తున్నాయి. మెదడు సరిగ్గా పనిచేయకపోవడం కారణంగా చాలా మంది ఏయే పనులు చేస్తున్నారని ఆర్థం కాకపోవడం కారణంగా సతమతమవుతున్నారు. అంతేకాకుండా కొందరిలో చదువు కూడా బుర్రకు ఎక్కడం లేదు. అయితే మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా పలు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ చిట్కాలు తప్పనిసరి:
బీట్రూట్ రసం:
రూట్ వెజిటేబుల్స్ మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ప్రతి రోజు తీసుకునే ఆహారాల్లో బీట్‌రూట్‌ను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. దీంతో పాటు నైట్రేట్ హైబీపీ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
గ్రీన్ టీ:
గ్రీన్ టీ తాగడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే కొన్ని ఔషధ గుణాలు మెదడును రిలాక్స్ చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఏకాగ్రతను పెంచేందుకు కూడా సహాయపడతాయి.
పసుపు టీ:
పసుపులో అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. అందుకే చాలా మంది పసుపును టీలా తయారు చేసుకుని వినియోగిస్తూ ఉంటారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెదడు వాపును సులభంగా తగ్గిస్తాయి. అంతేకాకుండా అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
బెర్రీల జ్యూస్:
బెర్రీ జ్యూస్‌లో పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వీటితో తయారు చేసిన జ్యూస్‌ను తాగడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. అంతేకాకుండా శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఆంథోసైనిన్లు జ్ఞాపకశక్తిని మెరుగుపరిచేందుకు సహాయపడతాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..