మన శరీరంలో అతి ముఖ్యమైన చిన్న భాగం మూత్రపిండాలు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీలు కూడా హెల్తీగా ఉండాలి. కిడ్నీలు శరీరంలో ఉండే వ్యర్థ పదార్ధాలను, విష పదార్దాలను మూత్రం రూపంలో బయటకి పంపడంలో పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా.. రక్తపోటుని నియంత్రించడంలో ఉపయోగపడే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. మనం తినే కొన్ని రకాల ఆహార పదార్థాలు కిడ్నీలను దెబ్బతీస్తాయి. హానికర ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల కిడ్నీలో ఇన్ఫెక్షన్, కిడ్నీలో రాళ్లు, కిడ్నీ కాన్సర్ వంటి మొదలైన సమస్యలు కలుగుతాయి.
కిడ్నీల పనితీరు ..
శరీరంలోని వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు కిడ్నీలు బయటకి పంపుతాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీన్ని ముందుగానే గుర్తించి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. కానీ కొందరికీ మూత్రపిండాల సమస్య చివరి దశలోనే బయటపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
కిడ్నీ విఫలం ముందు కనిపించే లక్షణాలు
- ఆకలి వేయకపోవడం
- శరీరం మీద వాపు
- ఎక్కువగా చలి వేయడం
- చర్మంపై దద్దుర్లు
- మూత్ర విసర్జనలో ఇబ్బంది
- చిరాకు
కిడ్నీలకు నష్టాన్ని కలగజేసే 5 ఆహార పదార్ధాలు
Also Read: Dragon Fruit: రోజూ ఈ ఫ్రూట్ తింటే కేన్సర్ సహా అన్ని రోగాలు మాయం
ఆల్కహాల్..
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలు పాడవుతాయి. ఆల్కహాల్ ఎక్కువగా తాగే వారి కిడ్నీల పనితీరులో సమస్యలు ఏర్పడతాయి. కిడ్నీల పనితీరు లోపం నేరుగా మెదడుపై ప్రభావాన్ని చూపుతుంది. ఆల్కహాల్ మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపడమే కాకుండా, ఇతర అవయవాలను పాడు చేస్తాయి.
ఉప్పు ..
మనం తినే ఉప్పులో సోడియం ఉంటుంది. ఈ సోడియం పొటాషియం తో కలిసి శరీరంలో ద్రవాల స్థాయిని పెంచుతాయి. ఆహారంలో అధికమొత్తంలో ఉప్పును తీసుకోవడం వలన శరీరంలో ద్రవాల స్థాయిలు పెరిగి.. కిడ్నీలపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఫలితంగా కిడ్నీలు వీధిలో నష్టం కలుగుతుంది.
పాల ఉత్పత్తులు..
పాలు, చీజ్, జున్ను, వెన్న వంటి పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం కిడ్నీకి మంచిది కాదు. పాల ఉత్పత్తుల్లో ప్రొటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి, ఇవి కిడ్నీలను దెబ్బతీస్తుంది. పాల ఉత్పత్తులలో కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి కారణం అవుతుంది. అందువల్ల పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.
రెడ్ మీట్..
రెడ్ మీట్‌లో ప్రొటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. మన శరీరానికి ప్రొటీన్లు కూడా అవసరం. మూత్రపిండాలను ప్రభావితం చేసే రెడ్ మీట్ ని తినడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరగదు. దీని ప్రభావం కిడ్నీలపై పడుతుంది.
ఆర్టిఫిషల్ స్వీట్నర్స్..
కిడ్నీ ఆరోగ్యానికి హాని కలిగించే స్వీట్లు, కుకీలు మరియు మార్కెట్‌లో లభించే పానీయాలలో ఆర్టిఫిషల్ స్వీట్నర్స్ లను ఎక్కువగా ఉపయోగిస్తారు.వాటి వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులు కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook