Kidney Care Tips: ఇటీవలి కాలంలో కిడ్నీ సమస్య వేగంగా పెరుగుతోంది. కిడ్నీ సమస్య కారణంగా ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతోంది. అయితే కేవలం ఆ మూడు డ్రింక్స్ తీసుకుంటే..డయాలసిస్ అవసరం లేకుండానే కిడ్నీ సమస్య దూరమౌతుంది.
కిడ్నీలనేవి శరీరంలో కీలకమైన భాగం. శరీరంలోని వ్యర్ధాల్ని బయటకు తీస్తుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..దైనందిక జీవితం బాగుండాలి. రోజంతా బయట జంక్ ఫుడ్ ఎక్కువగా తించే కిడ్నీల సామర్ధ్యం తగ్గిపోతుంది. డైట్ బాగుంటే కిడ్నీల ఆరోగ్యం బాగుంటుంది. కిడ్నీలపై శ్రద్ధ వహించకపోతే..కిడ్నీలు ఫెయిల్ అవడం, రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలు ఏర్పడతాయి. అందుకే డైట్ మార్చుకోవాలి. కిడ్నీలు పూర్తిగా ఆరోగ్యంగా ఉండేందుకు మూడు రకాల డ్రింక్స్ రోజూ తీసుకుంటే చాలు..
కొబ్బరినీళ్లు, ఇలాచీ
కొబ్బరినీళ్ల వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసిందే. దీనికితోడు ఇలాచీ అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. కొబ్బరినీళ్లు తరచూ తీసుకుంటే శరీరంలో నీటి కొరత ఉండదు. అటు ఇలాచీ కారణంగా శరీరంలో ఉండే బ్యాక్టీరియా అంతమౌతుంది. అదే సమయంలో నోటి దుర్వాసన కూడా పోతుంది. కిడ్నీల సంరక్షణ కోసం కొబ్బరినీళ్లు, ఇలాచీ మిశ్రమం మంచి ఫలితాలనిస్తుంది. కొబ్బరినీళ్లలో ఇలాచీ కలిపి తాగడం వల్ల కిడ్నీలు డీటాక్స్ అవుతాయి. కొబ్బరినీళ్లు ఎప్పుడు తాగినా..అందులో 2 గ్రాముల ఇలాచీ పౌడర్ కలుపుకుని తాగాలి.
అల్లం, ధనియాలు
చాలామంది ఆహారం జీర్ణమయ్యేందుకు ధనియాలు, గొంతు సమస్యలకు అల్లం తీసుకుంటుంటారు. కానీ ఈ రెండింటి వల్ల ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేందుకు అల్లం, ధనియాల కాంబినేషన్ అద్భుతమైన ఔషధం. దీనికోసం 5 గ్రాముల అల్లం, 5 గ్రాముల ధనియాలు తీసుకుని నీళ్లలో వేసి బాగా ఉడికించాలి. గాఢంగా కాడాలా మారిన తరువాత గోరువెచ్చగా చల్లార్చుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలు పూర్తిగా క్లీన్ అవుతాయి.
నిమ్మకాయ వేడినీళ్లు
నిమ్మకాయ శరీరానికి, ఆరోగ్యానికి ఎంతగా అవసరమో అందరికీ తెలిసిందే. మండువేసవిలో నిమ్మకాయ ఉపయోగం అద్భుతమే. కడుపుకు సంబంధించిన సమస్యలకు నిమ్మరసం మంచి పరిష్కారం. నిమ్మకాయలు శరీరంలో విటమిన్ సి లోటును పూర్తి చేస్తాయి. శరీరంలో పేరుకున్న వ్యర్ధాల్ని కూడా బయటకు పంపించడంలో నిమ్మరసం కీలకంగా ఉపయోగపడుతుంది. వేడినీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే..కిడ్నీలు డీటాక్స్ అవుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook