Jaggery And Milk Benefits: బెల్లం కలిపిన పాలు తాగితే చలి కాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

Jaggery And Milk  Benefits: బెల్లం కలిపిన పాలను ప్రతి రోజూ తీసుకోవడం శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే ఔషధ గుణాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2022, 04:52 PM IST
Jaggery And Milk  Benefits: బెల్లం కలిపిన పాలు తాగితే చలి కాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

Jaggery And Milk  Benefits: పాలు శాస్త్రాల్లో పాలను సంపూర్ణ ఆహారంగా భావిస్తారు. అయితే చాలా మంది చాయ్‌కి బదులుగా పాలు అలవాటు ఉండొచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలైతే ఎక్కువగా పాలను తినడానికే ఇష్టపడతారు. అయితే పాలలో బెల్లం వేసుకుని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మలబద్ధకం, గ్యాస్ సమస్యలు సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా బెల్లం పాలను క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చెద్దాం..

బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. తరచూ అలసటగా, బలహీనత, ఇతర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారు పాలలో బెల్లం కలుపుకుని తాగితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ పాలలో క్యాల్షియం శరీరంలోని బలహీనతను దూరం చేసేందుకు సహాయపడుతుంది.

2. జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా బెల్లం పాలు ప్రభావవంతంగా పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా అజీర్ణం, గుండెల్లో మంట, మలబద్ధకం వంటి అనేక పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

3. చలికాలంలో చాలా మంది రోగనిరోధక శక్తి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి బెల్లంతో కలిపిన పాలను ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, డి, జింక్, ఐరన్, సెలీనియం గనిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు సహాయపడతాయి. కాబట్టి చలి కాలంలో తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడతున్నవారు తప్పకుండా ఈ పాలను తీసుకోవాల్సి ఉంటుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read : Vijay Devarakonda ED : పాపులారిటీ ఉంటే ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి.. ఈడీ విచారణపై విజయ్ కౌంటర్లు

Also Read : Nara Brahmani Bike Riding : బాలయ్య కూతురా? మజాకా?.. బైక్ రైడర్‌గా నారా బ్రహ్మణి యాత్ర

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News