Protein Supplements Side Effects: జిమ్ ఇన్‌స్ట్రక్టర్లు సూచించే సప్లిమెంట్స్ ఏ మేరకు ఆరోగ్యానికి మంచిదనే చర్చ నడుస్తోంది ఇప్పుడు. అసలా సప్లిమెంట్స్ వాడవచ్చా లేదా, ఆ సప్లిమెంట్స్ సైడ్‌ఎఫెక్ట్స్ ఏంటనేది ఇప్పుడు పరిశీలిద్దాం.
ప్రోటీన్ల గురించి ఎక్కువగా చర్చ నడిచేది జిమ్స్‌లోనే. ఎందుకంటే రోజువారీ వర్కవుట్స్ పూర్తయిన తరువాత చాలామంది జిమ్ ఇన్‌స్ట్రక్టర్లు సూచించే ప్రోటీన్ షేక్స్ తీసుకుంటూ కన్పిస్తుంటారు. మనిషి శారీరక దారుఢ్యానికి, మజిల్ బిల్గిండ్‌కు ప్రోటీన్ పౌడర్లు, ప్రోటీన్ షేక్స్ చాలా ఉపయోగపడతాయని నమ్మిస్తారు. జిమ్‌కు వెళ్లేవాళ్లు నమ్ముతారు కూడా. డైటిషియన్లకు తరచూ ఎదురయ్యే ప్రశ్నలు కూడా ఇవే. మార్కెట్‌లో మంచి ప్రోటీన్ సప్లిమెంట్లు ఏవనే ప్రశ్నలు వస్తుంటాయి. అవి అసలు మంచిదేనా అనేది మరో ప్రశ్న. జిమ్‌కు వెళ్లేవారికి ప్రోటీన్ సప్లిమెంట్స్ అవసరమేనా కాదా అనేది మరో ప్రశ్న.
పిల్స్ లేదా మరే ఇతర సప్లిమెంట్ కంటే ఆహార పదార్ధాల్లోనే న్యుట్రియంట్స్ ఎక్కువగా సంగ్రహమవుతాయనేది ఎప్పుడూ మర్చిపోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పెద్దవాళ్లకు రోజుకు కిలోకు 0.8 నుంచి 1 గ్రామ్ ప్రోటీన్ అవసరం. అంటే మీ బరువు 50 కిలోలుంటే..రోజుకు 45-50 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటే చాలు. మీ రోజువారీ కేలరీ ఇన్‌టేక్‌లో ఇది 10-15 శాతం ఉంటుంది. అయితే పిల్లలకు, గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు ఇది మారుతుంది. స్పోర్ట్స్‌మెన్, అథ్లెట్స్‌కు కూడా మారుతుంటుంది. కొంతమందికి కిలోకు 1.5 నుంచి 2 గ్రాముల వరకూ తీసుకోవల్సి ఉంటుంది.
ప్రోటీన్ సప్లిమెంట్‌ను సిఫారసు చేసే ముందు చాలా రకాల అంశాల్ని పరిగణలో తీసుకోవల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా వ్యక్తిని బట్టి..వారి ఫిట్నెస్ గోల్‌ను బట్టి మారుతుంటుంది. ఏదేమైనా వేస్ట్ ప్రోటీన్‌ను శరీరం నుంచి తొలగించేందుకు ఎక్కువ నీరు మాత్రం తీసుకోక తప్పదు. ప్రతిరోజూ ఎక్కువగా ఫిజికల్ ఎక్సర్‌సైజులు చేసే అథ్లెటిక్స్ వంటివారు రోజుకు 1 నుంచి 2 గ్రాము ప్రోటీన్ తీసుకోవల్సి వస్తుంది. అయితే జిమ్‌లో ఓ మాదిరి ఫిట్నెస్ చేసేవారికి ఇంత పరిమాణంలో అవసరం లేదు. ఎక్కువ మోతాదులో ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకుంటే నాసియా, ఆకలి మందగించడం, డయేరియా, లివర్, కిడ్నీలపై ఒత్తిడి దారి తీస్తుంది. అదే ఏళ్ల తరబడి తీసుకుంటే కిడ్నీ, లివర్‌లు చెడిపోయే ప్రమాదం లేకపోలేదు. చివరికి ఆర్గాన్ ఫెయిల్యూర్‌కు దారి తీస్తుంది.
జిమ్ ట్రైనర్ సూచించే కొన్ని రకాల హై ప్రోటీన్ సప్లిమెంట్స్‌లో ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్ వంటివి కూడా ఉంటాయి. దీర్ఘకాలంగా స్టెరాయిడ్స్ వాడకమనేది అనారోగ్యానికి దారి తీస్తుంది. ఆస్ట్రేలియాకు చెందిన యాంటీ డోపింగ్ అధారిటీ ప్రకారం..ప్రతి ఐదుమంది క్రీడాకారుల్లో ఒకరు..నిషేధిత పదార్ధాలున్న స్టిమ్యులెంట్స్, ఎలాబోలిక్ డ్రగ్స్ కలిగి ఉన్న సప్లిమెంట్స్ వాడుతారట. ఏ విధమైన సప్లిమెంట్ క్షేమం కాదని కూడా ఆ అథారిటీ స్పష్టం చేసింది. ప్రకృతి సిద్ధమైన ఆహార పదార్ధాల కంటే మేలైన ప్రోటీన్ సప్లిమెంట్స్ మరేవీ లేవు.
ఎందులో ఏ మేరకు ప్రోటీన్లు
రోజుకు 2 వందల గ్రాముల పాలు తీసుకుంటే 6 గ్రాముల ప్రోటీన్స్ లభిస్తాయి. అదే ఒక బౌల్ పప్పు తీసుకుంటే 7 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. 40 గ్రాముల పన్నీరులో 7 గ్రాముల ప్రోటీన్లు, 100 గ్రాముల చికెన్‌లో 21 గ్రాముల ప్రోటీన్లు, ఒక కప్పు సోయా బీన్స్‌లో 7 గ్రాముల ప్రోటీన్లు, బియ్యం, రోటీలో 2.5 గ్రాముల ప్రోటీన్లు, ఒక గుడ్డులో 7 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. దీని ప్రకారం రోజుకు మీకు కావల్సిన 40-50 గ్రాముల ప్రోటీన్లను లెక్కేసుకుని ప్రకృతి సిద్ధమైన ఆహార పదార్ధాల్ని తీసుకుంటే చాలా మంచిది.
Also read: Health Benifits of Jaggery: బెల్లం తినడం వల్ల ఐదు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook