Winter Tips: చలికాలంలో స్వెటర్ ధరించి నిద్రపోతున్నారా? అయితే మీకు ఇలా జరగొచ్చు!

Winter Tips: చలికాలంలో రాత్రివేళ స్వెటర్ ధరించి నిద్రపోయే వారు చాలమందే ఉన్నారు. పగటి వేళతో పోల్చుకుంటే రాత్రి వేళలో చలి తీవ్రత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో చలి నుంచి రక్షణగా స్వెటర్లను ధరిస్తామని కొందరు చెబుతారు. అయితే అలా స్వెటర్లు ధరించి నిద్రించడం ఎంత ప్రమాదకరమో తెలుసా?  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2021, 06:22 PM IST
Winter Tips: చలికాలంలో స్వెటర్ ధరించి నిద్రపోతున్నారా? అయితే మీకు ఇలా జరగొచ్చు!

Winter Tips: శీతాకాలం కొందరికి చాలా ఇష్టమైన కాలం. కానీ, చలి అంటే నచ్చని వారు మాత్రం ఈ చలికాలం ఎప్పుడు ముగుస్తుందా? అని ఆందోళన చెందుతుంటారు. అయితే ఈ సీజన్ లో చలి గాలుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ప్రజలు ఉన్ని దుస్తులను ధరిస్తారు.

మరీ ముఖ్యంగా రాత్రి చలిగాలులను తట్టుకునేందుకు చాలా మంది ఉన్ని దుస్తులను ధరించి నిద్రిస్తుంటారు. అయితే అలా చేయడం చాలా ప్రమాదకరమని మీకు తెలుసా? రాత్రిపూట స్వెటర్‌తో నిద్రించడం వల్ల అనేక రకాల శారీరక సమస్యలు వస్తాయి.

చలికాలంలో రాత్రిపూట స్వెటర్ తో ధరించడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు..

చర్మ సమస్యలు

ఉన్ని దుస్తులతో నిద్రించడం వల్ల చర్మం పొడిబారుతుంది. ఇది చర్మంపై దురదను కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో రాత్రిపూట స్వెటర్‌తో నిద్రపోకపోవడమే మంచిది.

బ్లడ్ ప్రెషర్ (బీపీ)

స్వెటర్లను ధరించడం వల్ల శరీరం వెచ్చగా ఉండడం సహా బీపీ, డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. 

Low BP (లో బీపీ)

వెచ్చటి దుస్తులతో పడుకోవడం వల్ల రాత్రిపూట ఎక్కువగా చెమట పట్టవచ్చు. ఇది మీ రక్తపోటును కూడా తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితిలో స్వెటర్లను ధరించకపోవడమే మంచిది. 

శ్వాస అందకపోవడం..

ఉన్ని దుస్తుల్లో నిద్రించడం వల్ల ఆక్సిజన్ అందకపోవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు భయాందోళన వంటి సమస్యను ఎదుర్కొంటారు. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.

గమనిక: పైన పొందుపరిచిన సమాచారమంతా వైద్య నిపుణుల సలహా మేరకు సూచించినది. ఈ సమాచారాన్ని పాటించే ముందుగా వైద్య సలహాను తీసుకోవడం ఉత్తమం. ZEE మీడియా ఈ సమాచారన్ని ధ్రువీకరించడం లేదు.   

Also Read: Sex and Covid19: కోవిడ్ మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు సెక్స్ అవసరమంటున్న వైద్యులు

Also Read: Healthy Skin Tips: చలికాలపు చర్మ సమస్యలకు ఇలా చెక్ పెట్టవచ్చు..లేకపోతే ప్రమాదమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News