High Blood Sugar: మధుమేహం ఉన్నవారు బ్రౌన్ రైస్, అరటిపండ్లు తింటున్నారా? తింటే ఏం జరుగుతుందంటే!

Foods To Avoid With High Blood Sugar: మధుమేహంతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది ఆహారాలు తీసుకోవడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా పెరగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 12, 2023, 09:40 AM IST
High Blood Sugar: మధుమేహం ఉన్నవారు బ్రౌన్ రైస్, అరటిపండ్లు తింటున్నారా? తింటే ఏం జరుగుతుందంటే!

 

Foods To Avoid With High Blood Sugar: మధుమేహం ప్రస్తుతం సాధరణ వ్యాధిగా మారింది. అంతేకాకుండా ఈ వ్యాధి కొందరిలో సైలెంట్ కిల్లర్‌గా మారింది.  మధుమేహం పెరిగేకొద్దీ, స్ట్రోక్,  మూత్రపిండాలు, కాలేయం వంటి సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా కొంతమందిలో ఈ వ్యాధి ప్రాణంతకంగా కూడా మరుతోంది. అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మధుమేహంతో బాధపడేవారు రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండడానికి తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన పలు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ లక్షణాలను చూసి మధుమేహం ఉందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు:
మధుమేహంతో బాధపడేవారు తరచుగా దాహం, తరచుగా మూత్రవిసర్జన, అలసట, అకస్మాత్తుగా బరువు తగ్గడం, ప్రైవేట్ భాగంలో దురద వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొంతమందిలో గాయం వాపు మానుకోవడానికి చాలా టైమ్‌ పడుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. 

మధుమేహం ఉన్నవారు వీటిని అస్సలు తినకూడదు:
అరటిపండు:

అరటిపండ్లలో ఫైబర్‌ అధిక పరిమాణంలో లభిస్తుందని మధుమేహంతో బాధపడేవారు కూడా అతిగా తీసుకుంటూ ఉంటారు.  మధ్యస్థ పరిమాణంలో పండిన అరటిపండులో 14 గ్రాముల చక్కెర ఉంటుంది. వీటిని మధుమేహంతో బాధపడేవారు తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా తీవ్ర మధుమేహానికి కూడా దారి తీయోచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..

పండ్ల రసాలు:
పండ్ల రసాల్లో అధిక పరిమాణంలో విటమిన్లు, ఖనిజాల లభిస్తాయి. అంతేకాకుండా అధిక పరిమాణంలో చక్కెర కూడా లభిస్తుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు ప్రతి రోజు పండ్ల రసాలను తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మధుమేహంతో బాధపడేవాకు వీటిని తాగకపోవడం చాలా మంచిది. 

బ్రౌన్ రైస్:
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఎక్కువగా బ్రౌన్ రైస్ తింటూ ఉంటారు. అంతేకాకుండా మధుమేహంతో బాధపడేవారు కూడా అతిగా తీసుకుంటూ ఉంటున్నారు. బ్రౌన్ రైస్‌లో పీచుతో పాటు పిండి పదార్థాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఇలా రోజు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ రైస్‌ను ప్రతి రోజు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. 

Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News