High Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీయోచ్చు. కావున ఈ సమస్యల నుంచి సకాలంలో బయట పడితే చాలా మేలు లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తప్పకుండా ఆహారంపై శ్రద్ధవహించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆహారంలో మార్పులు, చేర్పులు చేయడం వల్ల ఈ కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆయుర్వేదం శాస్త్రం ప్రకారం కొత్తిమీర గింజలను కూడా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి వినియోగించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
కొత్తిమీర విత్తనాలు ఎలా ఉపయోగపడతాయి:
కొత్తిమీరను భారతీయులు మసాల దినుసులుగా వినియోగిస్తారు. దీనికి ఉండే సువాపన ఆహారాన్ని రుచికరంగా చేస్తుంది. ఈ కొత్తిమీర విత్తనాలు ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి చాలా సహాయపడుతుంది. అయితే వీటి గురించి ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు. ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి మూలకాలు కొత్తిమీర ఆకులలో ఉంటాయి. కావున కొలెస్ట్రాల్ తగ్గించడానికి కొత్తిమీర గింజలను ప్రతి ఆహారంలో వాడుకోవాలి.
మెంతులు:
కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి మెంతులు కూడా ప్రభావవంతంగా పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో విటమిన్ ఇ, యాంటీ డయాబెటిక్ లక్షణాలుంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నియంత్రిస్తాయి.
ఉసిరికాయ:
ఉసిరికాయలో ఉండే గుణాలు కూడా శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ఆయుర్వేద శాస్త్రంలో ఉసిరిని అనేక వ్యాధులకు ఔషధంగా వినియోగిస్తారని వివరించారు. అయితే ఇందులో విటమిన్ సి, అమైనో ఆమ్లాలలో పుష్కలంగా ఉంటాయి. కావున చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Telangana Rains Live Updates: హైదరాబాద్‌లో అర్ధరాత్రి కుండపోత వాన... ఆ జిల్లాలకు ఇవాళ భారీ వర్ష సూచన
Also Read : Sravana Remedies 2022: పరమేశ్వరుడు మీ కోరికలు నెరవేర్చాలంటే... ఆగస్టు 11లోపు ఈ చిన్న పని చేస్తే చాలు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook