Right Time To Drink Coconut Water: ఎండాకాలం భానుడి భగభగకు చెమటలు విపరీతంగా వస్తాయి. మన శరీరంలో ఉండే లవణాలు బయటికి వెళ్లిపోతాయి. దీంతో చల్లగా ఏం తాగాలా? అని కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములను వెతుకుతాం. కానీ, ఇవి అనారగ్యాన్ని తెచ్చిపెడతాయి. అయితే, శరీరంలో నుంచి లవ లవణాలు బయటికి వెళ్లిపోతే ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు.
వేసవికాలం వచ్చిందంటే చాలు చాలామంది ఎక్కువగా అలసిపోతుంటారు. ఎందుకంటే వీరి శరీరంలో నీటి శాతం బయటికి వెళ్లిపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అందుకే ఎక్కువగా నీరు ఉండే ఆహారాలు జ్యూసులు తీసుకోవాల్సి ఉంటుంది. వేసవి కాలం ఎంత ఎండగా ఉన్నా మన శరీరానికి నీటిని లవణాలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తే వేసవికాలం అయిపోయే వరకు మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు.
ఇదీ చదవండి: ఆరోగ్యాన్నిచ్చే అక్రోట్లు.. డైలీ ఇలా తింటే మీ శరీరంలో బిగ్ మిరాకిల్..
ఇలా నీటి శాతం అధికంగా ఉండే ఆహార పదార్థాలలో కొబ్బరి బొండం ఒకటి . ఇందులో నీరు లవణాలు రెండు కలిపి ఉంటాయి.ఈ ప్రకృతిలో ఎన్నో ఆహార పదార్థాలు పొల్యూట్ అవుతున్నాయి కానీ ఇలా కానీ ఏకైక ఆహారం కొబ్బరి బొండం. మిగతా ఆహార పదార్థాలన్నీ కచ్చితంగా ఎరువులు ఇతర పొల్యూషన్స్ ద్వారా ప్రభావితం చెందుతాయి. కానీ కొబ్బరి బోండం మాత్రం కాదు. ఇది ఓరల్ సెలైన్ వాటర్. కానీ, కొబ్బరి బోండం తాగడానికి కూడా ఓ టైం ఉంటుందని మీకు తెలుసా? అవును, ఇది నిజం సోషల్ మీడియా కొన్ని వార్తా నివేదికల ప్రకారం కొబ్బరిబోండం ఎండకాలం ఉదయం 10 సమయంలో తాగేయాలి. అయితే, లోబీపీ సమస్య ఉన్నవారు కొబ్బరి నీరు తాగకూడదు. ఎందుకంటే కొబ్బరి బోండం బ్లడ్ ప్రెజర్‌ను మరింత తగ్గిస్తుంది. వైద్యుల సూచన మేరకు వీరు కొబ్బరి బోండం తీసుకోవాల్సి ఉంది.
ఇదీ చదవండి: రాగిరొట్టె డయాబెటిక్ రోగులకు దివ్యౌషధం.. రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వదు...
కొబ్బరి బోండం నీరు ఒంట్లో సెలైన్ వాటర్‌లా పని చేస్తుంది. అందుకే ఎప్పడైనా మనకు మోషన్స్ వాంతులు అయినప్పుడు కొబ్బరి బొండం నీరు తాగమని వైద్యులు సూచనలు ఇస్తారు.100 గ్రాముల కొబ్బరి బొండం నీటిలో 94 గ్రాములు నీటి శాతం ఉంటుంది ప్రతిరోజు ఒక బొండం తాగితే శరీరానికి కావాల్సిన లవణాలు సోడియం అందుతుంది.ఎండాకాలం వేడి తడి తట్టుకోవడానికి చాలామంది కూల్ డ్రింక్స్ లో ఐస్ క్రీమ్ లో తింటారు కానీ ఇవి అనారోగ్యకరం ప్రతిరోజు ఒక బోండం తాగితే ఆరోగ్యకరంగా ఉండే డిహైడ్రేషన్ కి లోన్ అవకుండా ఉంటారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter