Men Sexual Health: మీ రోజువారీ జీవనశైలీతో పాటు ఆహారపు అలవాట్లు లైంగిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వివాహిత పురుషులు తమ ఆహారంలో కొన్ని పోషకాహారం చేర్చుకోవడం చాలా ముఖ్యం. పురుషుల్లో లైంగిక సామర్థ్యానికి చెందిన టెస్టోస్టెరాన్ హార్మోన్‌ను పెంచేందుకు ఆ తగిన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
నిపుణుల సూచనల మేరకు.. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల మీకు గొప్ప ప్రయోజనం లభిస్తుంది. సరైన ఆహార నియమాలను పాటించడం వల్ల పురుషుల్లో లైంగిక శక్తి స్థాయిలను పెంపొందిస్తుంది. వాటికి అదనంగా, విటమిన్ బి, విటమిన్ ఇ మరియు జింక్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం మీ ఆరోగ్యానికి మంచిది.
అరటిపండు
అరటిపండులో పొటాషియం, విటమిన్ బి6 పుష్కలంగా ఉన్నాయి. అరటిపండును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పురుషుల లైంగిక సమస్యలు తొలగిపోతాయి.
పాలకూర
ఆకుకూరల్లో పాలకూర క్రమం తప్పకుండా తినడం వల్ల కూడా పురుషుల లైంగిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆకుపచ్చని ఆకుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
వెల్లుల్లి
వెల్లుల్లిలో విటమిన్- సి, విటమిన్- బి6, ఫాస్పరస్, మాంగనీస్, జింక్, కాల్షియం, ఐరన్ ఉంటాయి. ఈ కారకాలన్నీ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణిస్తారు. వెల్లుల్లి తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్ ను పెంచడానికి కూడా సహాయపడుతుంది.
ఎండు ద్రాక్ష
వివాహిత పురుషులకు ఎండుద్రాక్ష చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్‌ను కూడా పెంచడం సహా పురుషులలో లైంగిక సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతుంది. ఎండుద్రాక్షను తేనెతో తింటే.. పురుషుల లైంగిక జీవితానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఎండు ఖర్జూరా
డ్రై ఫ్రూట్స్ లో ఎండు ఖర్జూరా పురుషుల్లో లైంగిక శక్తిని పెంచుతుంది. ఎండు ఖర్జూరాలోని అమైనో ఆమ్లాలు లైంగక సామర్థ్యం పెరుగుదలకు సహాయపడతాయి.
Also Read: Warm Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌కు వేడి వేడి అల్పాహారమే తీసుకోవాలి-ఆయుర్వేదం ఏం చెబుతోందంటే
Also Read: Omicron : ఆ లక్షణాలుంటే న్యూ ఇయర్ పార్టీలకు వెళ్లకండి.. ఒమిక్రాన్ ఉంది జాగ్రత్త..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి