Tulsi Tea Remedies: తులసి ఆకుల టీతో ఆరోగ్య ప్రయోజనాలు, స్థూలకాయానికి చెక్

Tulsi Tea Remedies: మీకు రోజూ ఉదయం లేచినవెంటనే టీ తాగే అలవాటుందా..ఉంటే ఆ టీలో ఈ ఆకు వేసి చూడండి. ఆరోగ్యపరంగా అద్భుత ఫలితాలుంటాయి. అటు బరువు కూడా గణనీయంగా తగ్గుతుంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 28, 2022, 07:11 PM IST
Tulsi Tea Remedies: తులసి ఆకుల టీతో ఆరోగ్య ప్రయోజనాలు, స్థూలకాయానికి చెక్

Tulsi Tea Remedies: మీకు రోజూ ఉదయం లేచినవెంటనే టీ తాగే అలవాటుందా..ఉంటే ఆ టీలో ఈ ఆకు వేసి చూడండి. ఆరోగ్యపరంగా అద్భుత ఫలితాలుంటాయి. అటు బరువు కూడా గణనీయంగా తగ్గుతుంది. 

రోజూ చేసే పనుల్లోనే కొద్దిగా మార్పులు చేస్తే చాలు అద్భుతమైన ఆరోగ్యం, ఫిట్నెస్ మీ సొంతం చేసుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. చాలామందికి ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే టీ తాగడం అలవాటు. కొంతమందైతే టీతోనే దినచర్య ప్రారంభిస్తారు. ప్రతిరోజూ అదే టీలో..తులసి ఆకులు వేసి తాగితే చాలా సమస్యల్నించి కాపాడుకోవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ప్రతిరోజూ ఉదయం తులసి టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. తులసి ఆకుల టీను ప్రతిరోజూ పరిమితంగా తీసుకుంటే..ఒత్తిడి, ఆందోళన అన్నీ దూరమౌతాయి. ఆరోగ్యం ఫ్రెష్‌గా ఉంటుంది. ఎనర్జీ లభిస్తుంది. 

2. బరువు తగ్గించేందుకు కూడా తులసి టీ అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. అయితే పరిమితి దాటకుండా నిర్ణీత మోతాదులో తీసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు గణనీయంగా తగ్గుతుంది. 

3. తులసి ఆకుల టీ తాగడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమౌతుంది. కొంతమందికి స్ట్రెస్, డిప్రెషన్ కారణంగా సరిగ్గా నిద్ర ఉండదు. ఈ పరిస్థితుల్లో డైట్‌లో తులసి ఆకుల టీ చేర్చుకుంటే..నిద్రలేమి సమస్య తొలగిపోతుంది. ఆరోగ్యంగా ఉంటారు. 

తులసి ఆకుల టీ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ బ్లడ్ షుగర్ సమస్య లేదా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా..తులసి టీ తాగకూడదు. గర్భిణీ మహిళలు కూడా తులసీ టీ తాగడం మంచిది కాదు. వైద్యుడిని సంప్రదించిన తరువాతే తీసుకోవాలి.

Also read: Gas Problems: చిన్నారుల్లో గ్యాస్ సమస్యలకు సులభమైన చిట్కాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News