Uric Acid Problem: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడానికి ప్రధాన కారణం జీవనశైలి, ఆహారపు అలవాట్లే. జీవన విధానం సరిగ్గా లేకపోవడం, జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, ఫాస్ట్ఫుడ్స్ అలవాటుగా చేసుకోవడం యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడానికి కారణమౌతుంది. యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే వెంటనే జీవనశైలిలో మార్పులు చేయాల్సిందే
ఆధునిక పోటీ ప్రపంచం కారణంగా వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి పూర్తిగా మన ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంటుంది. చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యల్లో ఒకటి యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్ సమస్య పెరిగితే జాయింట్స్, వేళ్లలో క్రిస్టల్స్ ఏర్పడుతుంటాయి. ఈ పరిస్థితుల్లో నొప్పి, స్వెల్లింగ్ ఎదుర్కోవల్సి వస్తుంది. యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే రోజువారీ కార్యక్రమాలు, ఆహారపు అలవాట్లలో మార్పులు చేర్పులు తప్పనిసరి.
స్వీట్ అండ్ సాఫ్ట్డ్రింక్స్కు ఎప్పుడూ దూరంగా ఉండాలి. ఇవి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. సాఫ్ట్‌డ్రింక్స్‌లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి హాని చేకూరుస్తుంది. అంతేకాకుండా యూరిక్ యాసిడ్ పెరగడంలో కీలకపాత్ర పోషిస్తుంది. మరోవైపు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే యూరిక్ యాసిడ్ తగ్గించడంలో విటమిన్ సి అత్యవసరమైన న్యూట్రియంట్. ఈ న్యూట్రియంట్ సహాయంతో గౌట్ ముప్పు కూడా తగ్గుతుంది. దాంతోపాటు రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ బ్యాలెన్స్‌గా ఉంటాయి. దీనికోసం ఆరెంజెస్, బత్తాయి, నిమ్మ, కివీ చాలా ఉపయోగపడతాయి.
యూరిక్ యాసిడ్ తగ్గించాలంటే ముందుగా బరువు తగ్గించాల్సి వస్తుంది. ఎందుకంటే బరువు పెరగడం వల్ల కలిగే దుష్పరిణామాల్లో యూరిక్ యాసిడ్ ఒకటి. బరువు నియంత్రణలో ఉంటే యూరిక్ యాసిడ్ కూడా నియంత్రణలోనే ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం అవసరమౌతాయి. మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాలి. మద్యం ఎక్కువగా సేవించేవారిలో యూరిక్ యాసిడ్ సమస్య ఉండనే ఉంటుంది. ఆల్కహాల్ అనేది కేవలం సామాజిక రుగ్మత మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం. అందుకే మద్యానికి దూరం పాటించండి.
రోజూ తీసుకునే ఆహారంలో లో ప్యూరిన్ ఫుడ్స్ మాత్రమే ఉండేట్టు చేసుకోవాలి. ఇలా చేస్తే యూరిక్ యాసిడ్ సమస్య కచ్చితంగా తగ్గుతుంది. దీనికోసం లోఫ్యాట్ పాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు తినవచ్చు.
Also read: Beauty Tips: ముఖంపై ముడతలు, మచ్చలు, పింపుల్స్ పోవాలంటే ఈ ఫేస్‌ప్యాక్ ట్రై చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook