టొమాటో ఆహార పదార్ధాల రుచిని పెంచుతుంది. అందుకే ప్రతి ఆహారంలో టొమాటో వినియోగం తప్పనిసరి అవుతుంది. టొమాటో ఆరోగ్యానికి మంచిదే కానీ..పరిమితి దాటకూడదు. లేకుంటే ప్రమాదర వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఆ వివరాలు మీ కోసం..
టొమాటోలో యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఫాస్పరస్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి లాభం చేకూరుస్తాయి. కానీ ఇదే టొమాటో కారణంగా చాలా వ్యాధులు కూడా రావచ్చు. టొమాటోలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి హాని కల్గిస్తాయి. టొమాటోలో ఉండే సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. అందుకే టొమాటో అతిగా తీసుకుంటే డయేరియా సంక్రమించవచ్చు. గ్యాస్, ఎసిడిటీకు కారణం కావచ్చు. కడుపు నొప్పి సమస్యకు దారి తీయవచ్చు. అందుకే జీర్ణక్రియ సంబంధిత సమస్య ఉన్నప్పుడు టొమాటోకు దూరంగా ఉండాలి.
రాళ్ల సమస్య
టొమాటోలో ఆక్జలేట్ అనే పదార్ధం ఉంటుంది. ఇది రాళ్లను ఏర్పరుస్తుంది. ఎక్కువ టొమాటో తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య ఏర్పడుతుంది. నీళ్లు తక్కువగా తాగడం వల్ల ఇలాంటి సమస్య ఉత్పన్నం కావచ్చు. కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే..టొమాటోకు దూరంగా ఉండాలి.
చర్మానికి ప్రమాదకరం
టొమాటో వినియోగం చర్మ సమస్యల్ని దూరం చేసేందుకు, ముఖ కాంతిని పెంచేందుకు ఉపయోగిస్తారు. కానీ ఇందులో ఉండే లైకోపీన్ కారణంగా చర్మం రంగు కోల్పోతుంది. స్కిన్ ఎలర్జీకు కారణం కావచ్చు.
జాయింట్ పెయిన్స్
జాయింట్ పెయిన్ సమస్య ఉన్నప్పుడు టొమాటో తింటే ప్రమాదకరం కావచ్చు. ఇందులో ఉండే సోలోనిన్ అనే పదార్ధం కారణంగా జాయింట్ పెయిన్స్ సమస్య మరింతగా పెరుగుతుంది. జాయింట్ పెయిన్స్ ఉంటే టొమాటోకు దూరంగా ఉండాలి.
Also read: Ldl Cholesterol: అవకాడోతో మీ చెడు కొలెస్ట్రాల్ ఇలా 12 రోజుల్లో కరగడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook