Dry Fruits: మనిషి ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణం హెల్తీ ఫుడ్ లేకపోవడమే. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి మనిషి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంటుంది. దాంతో శరీరానికి అవసరమైన పోషకాలు లోపించి వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
బాదం, పిస్తా, ఖర్జూరం, జీడిపప్పు, వాల్‌నట్స్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్‌గా పరిగణిస్తారు. వీటిలో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ లభిస్తాయి. అందుకే డ్రై ఫ్రూట్స్‌ని పోషకాల ఖజానాగా పిలుస్తారు. అందుకే హెల్తీ డైట్ జాబితాలో డ్రై ఫ్రూట్స్‌ని చేరుస్తారు. డ్రై ఫూట్స్ వల్ల ఆరోగ్యానికి అంతగా ప్రయోజనం చేకూరుతుంది. అయితే కొంతమంది డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తవచ్చంటున్నారు. ఆశ్చర్యంగా ఉందా..కానీ ఇది నిజమే. కొంతమంది డ్రై ఫ్రూట్స్‌కు దూరంగా ఉండాలి. డ్రై ఫ్రూట్స్ స్వభావం వేడి కావడంతో వేసవిలో తక్కువగా తినాలంటారు. చలికాలంలో మాత్రం అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. అయితే డ్రై ఫ్రూట్స్ తినే విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు.
బరువు తగ్గించుకోవాలనుకునేవాల్లు డ్రై ఫ్రూట్స్ తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి మంచివే అయినా..కేలరీలు పెద్దమొత్తంలో ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలతో పాటు ఫ్యాట్ కూడా ఉంటుంది. అందుకే బరువు నియంత్రించాలంటే డ్రై ఫ్రూట్స్ పరిమితంగా తీసుకోవాలి. డైట్ నుంచి తొలగిస్తే ఇంకా మంచిది.
కొంతమందికి డ్రై ఫ్రూట్స్ అంటే ఎలర్జీ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ తిన్న తరువాత దురద, గుచ్చుకోవడం, తల తిరగడం వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే మానేసి వైద్యుడిని సంప్రదించాలి. డ్రై ఫ్రూట్స్ స్వభావం వేడి కావడం వల్ల చర్మంపై దుష్ప్రభావం పడుతుంది.
ఇక అన్నింటికంటే ముఖ్యంగా డయాబెటిస్ రోగులు డ్రై ఫ్రూట్స్‌కు దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌లో గ్లూకోజ్ పెద్దమొత్తంలో ఉంటుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకే మధుమేహం వ్యాధిగ్రస్థులు డ్రై ఫ్రూట్స్‌కు దూరంగా ఉండాలి.
Also read: 2 Litres of Water Daily: ప్రతీ రోజూ 2 లీటర్ల నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదేనా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook