Diabetes Types: మధుమేహం అంటే ఏంటి, టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ అంటే ఎలా ఉంటాయి, చికిత్సా విధానమేంటి

Diabetes Types: డయాబెటిస్..ఇప్పుడిదే అతి ప్రమాదకరమైన స్లో పాయిజన్ లాంటి వ్యాధి. ఇందులో రెండు రకాలుంటాయి. అసలు డయాబెటిస్ అంటే ఏంటి, టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ అంటే ఏంటి, మెరుగైన చికిత్స ఏంటనేది తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 18, 2022, 06:41 PM IST
Diabetes Types: మధుమేహం అంటే ఏంటి, టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ అంటే ఎలా ఉంటాయి, చికిత్సా విధానమేంటి

Diabetes Types: డయాబెటిస్..ఇప్పుడిదే అతి ప్రమాదకరమైన స్లో పాయిజన్ లాంటి వ్యాధి. ఇందులో రెండు రకాలుంటాయి. అసలు డయాబెటిస్ అంటే ఏంటి, టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ అంటే ఏంటి, మెరుగైన చికిత్స ఏంటనేది తెలుసుకుందాం.

ఇటీవలి కాలంలో మధుమేహం ప్రదాన సమస్యగా మారుతోంది. వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు. సాధారణంగా జీవనశైలి సరిగ్గా లేకపోవడం, స్థూలకాయం కారణాలతో డయాబెటిస్ వస్తుంది. అసలు డయాబెటిస్ అంటే ఏంటి, ఇందులో ఉన్న రకాలేంటి, సరైన చికిత్సా విధానమేంటో చూద్దాం..

డయాబెటిస్ వ్యాధి ఎప్పుడైనా ఎవరికైనా సోకవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్నప్పుడు ఈ వ్యాధి వస్తుంది. బ్లడ్ షుగర్ అనేది మీ ఎనర్జీకు ముఖ్య కారకం. మీరు ఏదైనా ఆహారం తిన్నప్పుడు శరీరంలో గ్లూకోజ్‌గా మారి..శరీరంలోని మాంసకృతులకు ఎనర్జీ ఇస్తుంది. అయితే మోతాదుకు మించి గ్లూకోజ్ ఉండటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. షుగర్ వ్యాధికి సరైన చికిత్స కూడా అందుబాటులో లేదు. నియంత్రణ ఒక్కటే సాధ్యం. ఒకసారి డయాబెటిస్ బారిన పడ్డారంటే జీవితాంతం వెంటాడుతుంటుంది. అందుకే డయాబెటిస్ వ్యాధిని నియంత్రించుకోవాలి.

టైప్ 1 , టైప్ 2 డయాబెటిస్ అంటే ఏంటి

టైప్ 1 డయాబెటిస్ అనేది బాల్యంలో కూడా రావచ్చు. జీన్స్ ప్రకారం ఇంట్లో పెద్దవాళ్లలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే ఇది వస్తుంది. టైప్ 1 డయాబెటిస్‌లో శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుంది లేదా సక్రమంగా ఉండదు. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. శరీరంలో గ్లూకోజ్ సహాయంతో ఎనర్జీ అందించే పని ఇన్సులిన్ కారణంగానే జరుగుతుంది. అదే టైప్ 2 డయాబెటిస్ అనేది జంక్ ఫుడ్స్, జీవనశైలి సరిగ్గా లేకపోవడం, స్థూలకాయం కారణంగా వస్తుంది. 

ఒకసారి డయాబెటిస్ సోకిన తరువాత పూర్తిగా నిర్మూలించడం అసాధ్యం. అందుకే సరైన డైట్ ఆధారంగా నియంత్రించుకోవాలి. జీవితంలో బిజిగా ఉండి..ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే డయాబెటిస్ వ్యాధి ముదిరిపోతుంది. అదే ఆరోగ్యకరమైన ఫుడ్స్ అలవాటు చేసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. బ్యాలెన్స్‌డ్ లేదా హెల్తీ ఫుడ్ కోసం మీ రెగ్యులర్ డైట్‌లో మటర్, బీన్స్, జొన్న, యాపిల్, నేరేడు పండ్లు, స్ప్రౌట్స్, బ్రోకలీ, క్యారెట్ వంటి పదార్ధాలు తీసుకోవాలి. 

Also read: Kidney Care Tips: కిడ్నీ సమస్యకు ఆ మూడు డ్రింక్స్ తాగితే చాలు, డయాలసిస్ అవసరమే ఉండదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News