Thyroid Tips: థైరాయిడ్ సమస్యకు డైట్ ఒక్కటే సమాధానం, ఏది తినాలి, ఏది తినకూడదు

Thyroid Tips: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో థైరాయిడ్ ఒకటి. శరీరంలోని వివిధ పనుల్ని నియంత్రించేది ఇదే. మనిషి జీవనశైలిని బట్టి థైరాయిడ్ ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే ఆహారపు అలవాట్లు కీలక భూమిక పోషిస్తాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 7, 2023, 07:39 PM IST
Thyroid Tips: థైరాయిడ్ సమస్యకు డైట్ ఒక్కటే సమాధానం, ఏది తినాలి, ఏది తినకూడదు

Thyroid Tips: శరీరంలో అంతర్గతంగా ఏర్పడే వివిధ రకాల సమస్యలు అనేక లక్షణాలతో బయటపడుతుంటాయి. బయటపడే ప్రతి లక్షణం వెనుక అంతర్గతంగా ఏదో ఒక అంగంలో సమస్య తలెత్తి ఉంటుంది. ఆ లక్షణాలను బట్టి శరీరంలోని అంగాల సమస్యల్ని గుర్తించగలగాలి. అప్పుడే ఏ సమస్యకైనా సకాలంలో చికిత్స ఉంటుంది.

మానవ శరీరంలో ఒక్కొక్క అంగానికి ఒక్కో ప్రాధాన్యత, విధి ఉంటుంది. అదే విధంగా థైరాయిడ్ అతి ముఖ్యమైన అంగంగా ఉంది. థైరాయిడ్ అనేది ఓ గ్రంధి. మనిషి శరీరంలో మెడ భాగంలో లోపల సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. మనిషి శరీరానికి అవసరమైన హార్మోన్ల విడుదల ఈ గ్రంథి చేసే పని. ఈ గ్రంథిలో సమస్య ఏర్పడితే హార్మోన్ల విడుదలపై ప్రభావం పడి..వివిధ రకాల సమస్యలు ఏర్పడతాయి. థైరాయిడ్ సమస్య ఉంటే శరీరం సామర్ధ్యం అంటే పనితీరు కూడా ప్రభావితమౌతుంది. ఆహారపు అలవాట్లను సక్రమం చేసుకోవడం ద్వారా థైరాయిడ్ గ్రంథిలో తలెత్తే సమస్యను సరిచేయవచ్చు. అంటే థైరాయిడ్ సమస్యను దూరం చేయవచ్చు. థైరాయిడ్ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఏయే పదార్ధాలు తీసుకోవాలో, ఏవి తీసుకోకూడదో తెలుసుకుందాం..

క్రూసిఫెరోస్ కూరగాయలైన కాలిఫ్లవర్, బ్రోకలి, అరటి ఆకులు వంటివి థైరాయిడ్ సమస్యను మరింత పెంచుతాయి. అందుకే మీ డైట్‌లో ఇవి లేకుండా చూసుకోవాలి.

గ్లూటెన్ అనేది థైరాయిడ్ సమస్యను పెంచుతుంది. అందుకే గ్లూటెన్ ఉండే పదార్ధాలను డైట్‌కు దూరంగా ఉంచడం మంచిది. రోజూ నిర్ణీత సమయంలో వ్యాయామం చేయడమే కాకుండా ఒత్తిడి లేని జీవనశైలిని అలవర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. 

యాపిల్‌లో ఉండే పేక్టిన్ అనే ఫైబర్ థైరాయిడ్ హార్మోన్‌ను సమతుల్యం చేయడంలో దోహదపడుతుంది. రోజూ యాపిల్ తినడం వల్ల థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. 

బ్రౌన్ రైస్‌లో థైరాయిడ్‌కు అవసరమైన న్యూట్రియంట్లు ముఖ్యంగా సెలేనియం, జింక్, ఐరన్ ఉంటాయి. అందుకే థైరాయిడ్ రోగుల్ని బ్రౌన్ రైస్ తినమని వైద్యులు సూచిస్తుంటారు. 

ఇక బాదం, వాల్‌నట్స్, బ్రెజిల్ నట్స్ థైరాయిడ్ సమస్య ఉన్నవారికి చాలా మంచిది. ఇందులో సెలేనియం, జింక్ వంటి కీలకమైన పోషకాలుంటాయి. ఇవి థైరాయిడ్ సమస్యను అద్భుతంగా నియంత్రిస్తాయి. 

పెరుగులో ఉండే ప్రో బయోటిక్స్ ప్రేవుల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అదే సమయంలో థైరాయిడ్ సమస్యను నియంత్రించడంలో ఉపయోగపడతాయి.

Also read: Buttermilk Cautions: మజ్జిగ ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదని తెలుసా, ఎప్పుడు తాగితే మంచిది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News