Health Tips: లివర్‌పై ప్రతికూల ప్రభావం చూపించే పదార్ధాలివే, వెంటనే డైట్ నుంచి దూరం చేయండి

Health Tips: శరీరంలోని అంగాల్లో అతి ముఖ్యమైంది లివర్. గుండె, కిడ్నీలకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో లివర్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. లివర్ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవడం చాలా అవసరం. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 3, 2023, 08:39 PM IST
Health Tips: లివర్‌పై ప్రతికూల ప్రభావం చూపించే పదార్ధాలివే, వెంటనే డైట్ నుంచి దూరం చేయండి

Health Tips: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఇందులో ప్రధానమైనవి అధిక రక్తపోటు, డయాబెటిస్, కొలెస్ట్రాల్. ఈ వ్యాధుల ప్రభావం నేరుగా లివర్, కిడ్నీలు, గుండెపై పడుతుంటుంది. లివర్‌పై ప్రతికూల ప్రభావమంటే ప్రమాదకరంగానే భావించాలి.

లివర్ అనేది మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగం అనడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. ఎందుకంటే మనం తీసుకునే ప్రతి ఆహారం ప్రభావం నేరుగా లివర్‌పైనే పడుతుంటుంది. ప్రస్తుత జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా లివర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంటుంది. ముఖ్యంగా మసాలా పదార్ధాలు, మాంసాహారం అతిగా తినడం, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వంటివి లివర్ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. జీవనశైలి సరిగ్గా లేకపోతే లివర్ పాడయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకే హెల్తీ ఫుడ్ అనేది చాలా అవసరం. కొన్ని రకాల ఆహార పదార్ధాలు లివర్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంటాయి. ఇలాంటి పదార్ధాలను గుర్తించి డైట్ నుంచి దూరం చేయాలి.

లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పదార్ధాలను డైట్ నుంచి దూరం చేయాల్సిందే. అందులో ముఖ్యమైనవి జంతు ఉత్పత్తులు. వాస్తవానికి జంతు ఉత్పత్తులనేవి ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంటాయి. అయితే పరిమితి మించి తీసుకుంటే చెడు ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఇందులో శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. వెన్నతో సహా పాలు తీసుకోవడం లివర్‌కు మంచిది కాదు. లివర్ ఆరోగ్యంపై ప్రతికూలం ప్రభావం పడుతుంది. 

లివర్ ఆరోగ్యాన్ని వెంటనే పాడు చేసేది ఆల్కహాల్. ఇది మీ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఆల్కహాల్ అనేది నెమ్మదిగా మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంటుంది. అందుకే లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. మద్యం లివర్‌తో పాటు ఆరోగ్యానికి కూడా హానికరమే. అందుకే మద్యపానం వదిలితే ఆరోగ్యం లక్షణంగా ఉంటుంది. సకల సమస్యలకు మూలకారణం మద్యపానం, ధూమపానాలే. 

స్వీట్స్ ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు. ఆరోగ్యానికి హాని కల్గిస్తాయి. షుగర్‌ను ఫ్యాట్‌గా మార్చడం లివర్ చేసే పని. ఎక్కువ స్వీట్స్ లేదా షుగర్ తినడం వల్ల ఎక్కువ ఫ్యాట్ ఉత్పత్తి అవుతుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే ఫ్యాటీ లివర్ వ్యాధి పెరుగుతుంది. అనారోగ్యం బాధిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే లివర్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. 

Also read: Green Apple Benefits: గ్రీన్ ఆపిల్ ప్రయోజనాలు ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News