Diabetic Tips: డయాబెటిక్ రోగులు తప్పకుండా తినాల్సిందే, బ్లడ్ షుగర్, మలబద్ధకం రెండూ మాయం

Diabetic Tips: మధుమేహం అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ప్రపంచంలో అత్యధికంగా ప్రభావితమౌతోంది ఈ సమస్యతోనే. ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా తలెత్తే ఈ వ్యాధిని అరికట్టడం కూడా అదే పద్ధతిలో చేయాల్సి ఉంటుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 14, 2023, 05:33 PM IST
Diabetic Tips: డయాబెటిక్ రోగులు తప్పకుండా తినాల్సిందే, బ్లడ్ షుగర్, మలబద్ధకం రెండూ మాయం

Diabetic Tips: ఆధునిక లైఫ్‌స్టైల్ వ్యాధిగా పరిగణించే డయాబెటిస్ నియంత్రణ పూర్తిగా మన ఆహారపు అలవాట్లు, జీవన విధానంపైనే ఉంది. ఆహారపు అలవాట్లను, జీవనశైలిని మార్చుకోవడం ద్వారా లేదా మెరుగుపర్చుకోవడం ద్వారా డయాబెటిస్‌ను సులభంగానే నియంత్రించవచ్చు. ఆ వివరాలు మీ కోసం..

డయాబెటిస్ నియంత్రణ అనేది నూటికి 90 శాతం ఆహారపు అలవాట్లు, జీవన విధానంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే డయాబెటిస్ సోకిన రోగులు ప్రతిరోజూ తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోవాలి. లేకపోతే బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. వ్యాధి ముప్పు పెరుగుతుంది. రోజూ ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం, ఎలాంటి ఆహారం తీసుకోకూడడనే వివరాలు గుర్తుంచుకోవాలి. డయాబెటిస్ నియంత్రణకు క్యాబేజ్ అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇదొక్కటే కాదు ఏ ఆకు కూరలైనా డయాబెటిస్ నియంత్రణకు కీలకంగా ఉపయోగపడతాయి. ఆరోగ్యానికి ప్రయోజనకరం. క్యాబేజ్ తినడం వల్ల శరీరానికి కావల్సిన విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ఫైటో న్యూట్రియంట్లు లభిస్తాయి. దాంతోపాటు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా రోగాల్నించి కాపాడుతాయి.

రోగ నిరోధక శక్తి

వాతావరణం మారినప్పుడల్లా ఇన్‌ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. జలుబు, జ్వరం, దగ్గు వంటివి ఇందులో ముఖ్యమైనవి. శరీరాన్ని వీటి నుంచి కాపాడేది రోగ నిరోధక శక్తి. క్యాబేజ్ రోజూ తప్పకుండా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వృద్ధి చెందుతుంది.

డయాబెటిస్ ముప్పు

క్యాబేజ్ క్రమం తప్పకుండా తినడం వల్ల డయాబెటిస్ ముప్పు తగ్గుతుంది. రోజువారీ డైట్‌లో భాగం చేసుకుంటే మంచి ప్రయోజనాలున్నాయి. ఇందులో యాంటీ హైపర్ గ్లైసోమిక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ టోలరెన్స్‌ను మెరుగుపరుస్తుంది. ఇన్సులిన్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. 

అధిక బరువుకు చెక్

ఇటీవలి కాలంలో స్థూలకాయం లేదా అధిక బరువు పెను సమస్యగా మారింది. క్యాబేజ్ ఈ సమస్యలు మంచి పరిష్కారం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మంచి ప్రయోజనాలుంటాయి. ఎందుకంటే క్యాబేజీలో కేలరీలు చాలా తక్కువ. దాంతో శరీరంలో కొవ్వు పెరగకుండా ఉంటుంది.

మలబద్ధకం 

క్యాబేజ్ అనేది జీర్ణక్రియను మెరుగుపర్చడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైర్, ఆంథోసయానిన్, పోలీఫెనోల్ పుష్కలంగా ఉంటాయి. మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ సమస్యల్నించి విముక్తి పొందాలంటే క్యాబేజ్ అద్భుతంగా పనిచేస్తుంది. 

Also read: Vitamin B12 Foods: విటమిన్ బి12 లోపముంటే శరీరం గుల్లవడం ఖాయం, ఈ పదార్ధాలతో చె

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News