Tulsi Benefits: తులసి మొక్కకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఆధ్యాత్మికంగా చాలా మహత్యముంటుంది. ఇంట్లో ఉంచుకుంటే శుభంగా భావిస్తారు. తులసి మొక్కకున్న ఔషధ గుణాల కారణంగా ఆయుర్వేదంలో చాలా విశిష్టత ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తులసి మొక్కలో ఉండే కొన్ని గుణాల వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒత్తడిని దూరం చేయవచ్చు. ఆందోళన తగ్గించుకోవచ్చు. తులసి ఆకుల్ని రోజూ తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. తులసి మొక్కలో ఔషద గుణాలకు కొదవ ఉండదు. ఇమ్యూనిటీని వేగవంతం చేస్తుంది. ఫలితంగా శరీరం వివిధ రకాల వ్యాధులకు గురి కాకుండా కాపాడుకోవచ్చు.
శ్వాస సంబంధిత సమస్యలకు తులసి ఆకులు మంచి పరిష్కారం కల్గిస్తాయి. దగ్గు, జలుబు వంటి సమస్యలుంటే తులసి ఆకులతో కాడా చేసుకుని తాగితే మంచి ఫలితాలుంటాయి. దగ్గు, జలుబు వంటి సమస్యల్ని దూరం చేయడంలో తులసి ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. ఇక మరో ముఖ్యమైన ప్రయోజనం కడుపు సంబంధిత సమస్యలు దూరం కావడం. తులసి ఆకుల్ని నమిలి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తులసి ఆకులతో ఎసిడిటీ తగ్గించవచ్చు. స్వెల్లింగ్ వంటి సమస్యలు దూరమౌతాయి. తులసి ఆకుల్ని నీటిలో ఉడకబెట్టి ఆ నీళ్లు తాగినా అవే ఫలితాలుంటాయి.
తులసి మొక్క ఆకుల్ని రోజూ క్రమం తప్పకుండా నమిలి తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. తులసి ఆకుల్ని డైట్‌లో భాగంగా చేసుకోవడం ద్వారా డయాబెటిస్ తీవ్రత పెరగకుండా చూసుకోవచ్చు. ఇన్‌ఫెక్షన్ ఇతర సమస్యల్నించి కాపాడుకోవచ్చు.
Also read: Paytm iPhone 15 Offer: మీరు పేటీఎం వాడుతున్నారా, అయితే ఐఫోన్ 15 గెల్చుకోవచ్చు, ఎలాగంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Tulsi Benefits: తులసి ఆకులు రోజూ తింటే చాలు, ఏ వ్యాధి కూడా దరి చేరదు