Coriander Benefits: ధనియాలు వంటల్లోనే కాదు..ఇలా వాడి చూడండి, లాభాలు తెలిస్తే వదిలిపెట్టరు

Coriander Benefits: ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే మసాలా దినుసుల ఉపయోగం చాలా ఎక్కువ. స్పైసీగా ఉన్నా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. కేవలం రుచిని పెంచడమే కాదు..ఆరోగ్యపరంగా అద్బుతమైన లాభాలున్నాయి..పూర్తి వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 26, 2023, 04:53 PM IST
Coriander Benefits: ధనియాలు వంటల్లోనే కాదు..ఇలా వాడి చూడండి, లాభాలు తెలిస్తే వదిలిపెట్టరు

Coriander Benefits: దేశంలో ప్రతి కిచెన్‌లో మసాలా దినుసులు తప్పకుండా ఉంటాయి. అందులో ధనియాలు అతి ముఖ్యమైనవి. ఎందుకంటే ధనియాలు వాడకుండా దాదాపుగా ఎలాంటి వంట ఉండదేమో. ధనియాలు ఇంచు మించు అన్ని వంటల్లో వినియోగిస్తుంటారు. అదే సమయంలో ధనియాల నీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. 

వాస్తవానికి చాలా మంది ధనియాలను వంటల్లో వినియోగిస్తుంటారు. ధనియాలు ఉపయోగించడం వల్ల ఆ వంటల రుచి పెరుగుతుంది. నేరుగా వేయవచ్చు లేదా ధనియాల పౌడర్ వాడుతుంటారు. నాన్ వెజ్ వంటల్లో అయితే తప్పనిసరి. ధనియాల పౌడర్ వేయాల్సిందే. అయితే ధనియాల పౌడర్‌ను వంటల్లో రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యపరంగా ప్రయోజనం చేకూర్చేందుకు కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే ధనియాల్లో పోషకాలు చాలా ఎక్కువ. ధనియాల్లో ఉండే కొన్ని రకాల పోషకాల వల్ల వివిధ రకాల వ్యాధులు కూడా దూరమౌతాయి. బ్లడ్ షుగర్ తగ్గించేందుకు ధనియా నీళ్లు అద్భుతంగా ఉపయోగపడతాయి. జీర్ణక్రియ మెరుగుపడేందుకు కూడా ధనియాలు దోహదం చేస్తాయి.

ధనియా గింజల్లో పొటాషియం, కాల్షియం, విటమిన్ కే వంటి పోషకాలు చాలా ఎక్కువ. అందుకే ధనియాలు రోజూ భోజనం తరువాత కొద్దిగా నమిలి తినడం లేదా రోజూ ఉదయం పరగడుపున ధనియాల నీళ్లు తాగడం వల్ల శ్వాస సంబంధం సమస్యలు దూరమౌతాయి. ధనియాల నీళ్లతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ధనియా నీళ్లు చాలా సులభంగా చేసుకోవచ్చు. 2-3 కప్పుల నీళ్లలో ఒక స్పూన్ ధనియాల వేసి బాగా ఉడకబెట్టాలి. ఆ తరువాత ఈ నీళ్లను వడకాచి గోరువెచ్చగా తాగితే మంచి ఫలితాలుంటాయి.

మధుమేహం నియంత్రణలో

డయాబెటిస్ రోగులు బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడూ నియంత్రణలో ఉండేట్టు చూసుకోవాలి. దీనికోసం ప్రతి రోజూ పరగడుపున ధనియా నీళ్లు తాగితే మంచి ఫలితాలుంటాయి. బ్లడ్ షుగర్ తగ్గి నియంత్రణలో ఉంటుంది. కొత్తిమీరలో కూడా ఆరోగ్యపరంగా ప్రయోజనాలు అత్యధికం. రక్తంలో గ్లూకోజ్ తొలగించి నియంత్రణలో ఉండేట్టు చేస్తుంది. 

ధనియా నీళ్లు ఏ సీజన్‌లో అయినా సరే తాగవచ్చు. ఇదొక అద్బుతమైన డీటాక్స్ డ్రింక్ కూడా. ధనియా నీళ్లు తాగడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది. దాంతోపాటు కిడ్నీ క్లీన్ అవుతుంది. శరీరంలోని వ్యర్ధాలు బయటకు తొలగిపోతాయి.

రోజూ ధనియా నీళ్లు తాగే అలవాటుంటే అంతకంటే మంచి అలవాటు మరోటి లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఒక్క అలవాటు మీ శరీరం ఇమ్యూనిటీని వేగంగా పెంచుతుంది. ఇమ్యూనిటీ పెరిగిందంటే సహజంగానే ఎలాంటి రోగాలు దరిచేరవు. ధనియాలో ఉండే కెరోస్టీన్, టోకోఫెరోల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని నష్టపర్చే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. 

Also read: Ice Apple Benefits: ఐస్ యాపిల్ ఎప్పుడైనా తిన్నారా..ఆదే తాటి కళ్లు, ఆరోగ్యానికి ఎంత మంచిదంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News