Blood Pressure: ప్రాణాంతకమైన అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం ఎలా

Blood Pressure: రక్తపోటు అనేది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. జీవనశైలి కారణంగా తలెత్తే సమస్యల్లో ఇదొకటి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంకంగా మారనున్న అధిక రక్తపోటు నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 25, 2022, 09:50 PM IST
Blood Pressure: ప్రాణాంతకమైన అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం ఎలా

Blood Pressure: రక్తపోటు అనేది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. జీవనశైలి కారణంగా తలెత్తే సమస్యల్లో ఇదొకటి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంకంగా మారనున్న అధిక రక్తపోటు నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుత బిజీ ప్రపంచంలో జీవనశైలి పూర్తిగా మారిపోయింది. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, విపరీతమైన పని ఒత్తిడి, జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఇలా వివిధ కారణాలతో పలు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ సమస్యల్లో ప్రధానమైంది అధిక రక్తపోటు సమస్య. ఇదొక సైలెంట్ కిల్లర్ లాంటిది. గుండె నుంచి శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా అయ్యే సమయంలో ధమనులు సంకోచిస్తే..అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. కానీ జీవనశైలిలో మార్పులతో అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.  అధిక రక్తపోటు నుంచి విముక్తి పొందేందుకు ఏం చేయాలో చూద్దాం..

రక్తపోటుకు కారణాలు

స్థూలకాయమనేది చాలా సమస్యలకు మూలకారణం. స్థూలకాయం ఉన్నప్పుడు కచ్చితంగా అధిక రక్తపోటు ఉంటుంది. అధిక బరువుండేవారికి..తక్కువ బరువుండేవారితో పోలిస్తే బ్లడ్ ప్రెషర్ సమస్య ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు తగ్గించాలంటే ముందు..బరువు తగ్గించాలి.

అధిక రక్తపోటు నుంచి ఉపశమనం ఎలా

క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. రోగాల్ని దూరం చేయవచ్చు. మీరు కూడా అధిక రక్తపోటుతో బాధపడుతుంటే క్రమంగా తప్పుకుండా వ్యాయామం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల యాక్టివ్‌గా ఉండటమే కాకుండా..బరువు తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే బరువు తగ్గుతారో..రక్తపోటు తగ్గుతుంది. 

మద్యం తాగడం అనేది చెడు జీవనశైలిలో భాగం. రోజూ మద్యం తాగుతుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మద్యం అనేది బ్లడ్ ప్రెషర్ పెంచేందుకు ఓ కారణం. రోజూ మద్యం తాగే అలవాటుంటే ఇవాళ్టి నుంచే మానేయడం మంచిది.

Also read: World Lungs Day: మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నాయా లేవా..ఇలా తెలుసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News