Health Tips: చలికాలంలో ఈ మూడు పదార్ధాలు డైట్‌లో ఉంటే..ఏ వ్యాధీ దరిచేరదు

Health Tips: చలికాలంలో సాధారణంగా వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఆరోగ్యం పాడవుతుంటుంది. అయితే కొన్ని పదార్ధాల్ని డైట్‌లో చేరిస్తే..వ్యాధులు దరిదాపుల్లో కూడా ఉండవు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 4, 2023, 10:46 PM IST
Health Tips: చలికాలంలో ఈ మూడు పదార్ధాలు డైట్‌లో ఉంటే..ఏ వ్యాధీ దరిచేరదు

చలికాలం అంటే సహజంగానే అందరూ ఇష్టపడతారు. అదే సమయంలో ఇమ్యూనిటీ తగ్గడంతో వివిధ రకాల వ్యాధుల ముప్పు కూడా పెరుగుతుంది. కడుపు నొప్పి, అజీర్తి, మలబద్ధకం, జలుబు, దగ్గు వంటి సమస్యలన్నీ చలికాలంలోనే ఎదురౌతుంటాయి. 

చలికాలంలో ఎదురయ్యే ఈ వ్యాధుల్నించి సంరక్షించుకునేందుకు కొన్ని సులభమైన చిట్కాలున్నాయి. ముఖ్యంగా డైట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇమ్యూనిటీని మెరుగుపర్చే ఆహార పదార్ధాలు తప్పకుండా తీసుకోవాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఇమ్యూనిటీని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే డైట్‌లో కొన్ని పదార్ధాలు తప్పకుండా చేర్చాలి. డైట్‌‌లో కొన్ని పదార్ధాలు చేర్చితే ఈ వ్యాధులేవీ దరిదాపుల్లో రావు. 

బెల్లంతో ప్రయోజనాలు

బెల్లంలో ఫాస్పరస్, కాల్షియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దాంతో చలికాలంలో బెల్లం తింటే మెరుగైన ఫలితాలు చూడవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు ఇబ్బందులుంటే బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది. శెనగలతో పాటు బెల్లం తింటే..శరీరంలో ఐరన్ లోపం కూడా తొలగిపోతుంది. ఎనీమియా వంటి వ్యాధుల్నించి రక్షించుకోవచ్చు.

ఖర్జూరం లాభాలు

ఖర్జూరంలో కాల్షియం, పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల ఖర్జూరం తింటే ఆరోగ్యంపై మంచి ప్రభావం పడుతుంది. ఖర్జూరంలో పెద్ద మొత్తంలో ఉండే ఫైబర్ కారణంగా కడుపు సంబంధిత సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. ఖర్జూరం తినడం వల్ల శరీరం ఇమ్యూనిటీ పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు దరిచేరవు. 

గుడ్లతో కలిగే ప్రయోజనాలు

చలికాలంలో గుడ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తాయి. గుడ్లు శరీరానికి అంతర్గత వేడి అందిస్తాయి. ఫలితంగా జలుబు, దగ్గు సమస్యలు తొలగిపోతాయి. గుడ్లు తినడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మజిల్స్ అభివృద్ధికి దోహదపడతాయి. ఇందులో ఉండే పోషక పదార్ధాల వల్ల శరీరం పటిష్టంగా మారుతుంది. 

Also read: Diabetes: ఫిజియోథెరపీతో కూడా డయాబెటిస్‌కు చెక్ పెట్టవచ్చా, ఎలాగో తెలుసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News