మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా కావల్సింది ఇమ్యూనిటీ. రోగ నిరోధక శక్తి బలహీనమైతే తరచూ అనారోగ్యం వెంటాడుతుంటుంది. ఈ క్రమంలో రోగ నిరోధక శక్తి ఎందుకు తగ్గుతుంది, కారణాలేంటనేది వివరంగా తెలుసుకోవడం మంచిది.
మీరు తరచూ అనారోగ్యానికి గురవుతుంటే..ఇమ్యూనిటీ తగ్గుదలకు అదే తొలి లక్షణం కావచ్చు. రోగ నిరోధక శక్తి బలహీనమవడానికి కారణం కొన్ని చెడు అలవాట్లు కావచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి అలవాట్లు మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయనేది పరిశీలిద్దాం.
ఇమ్యూనిటీ తగ్గడానికి కారణాలు
1. చాలామంది పంచదార ఎక్కువగా తీసుకుంటుంటారు. పంచదార అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ఇది మీ ఇమ్యూనిటీని బలహీనపరుస్తుంది.
2. ఆయిలీ ఫుడ్ తినడం కూడా ఓ కారణం కావచ్చు ఆయిలీ ఫుడ్స్ తరచూ తినే అలవాటుంటే..ఇమ్యూనిటీ కచ్చితంగా బలహీనమౌతుంది.
3. ప్రోసెస్డ్ మటన్ తినడం కూడా మనిషి ఇమ్యూనిటీ తగ్గేందుకు కారణం. ఇందులో శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హాని కల్గిస్తుంది.
4. రిఫైండ్ కార్బొహైడ్రేట్లు ఉన్న భోజనం కూడా తగ్గించాలి. ఈ అలవాటు కచ్చితగా ఇమ్యూనిటీపై దుష్ప్రభావం చూపిస్తుంది. ఆధునిక జీవనశైలి, మొబైల్ ఫోన్ అధికంగా వాడటం, నిద్ర సరిగ్గా లేకపోవడం కూడా ఇమ్యూనిటీని తగ్గించే కారణాలు
5. చైనీస్ ఫుడ్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇందులో పోషకాలు ఉండవు. ఫలితంగా ఇమ్యూనిటీ బలహీనమౌతుంది.
Also read: Lifestyle Diseases: లైఫ్‌స్టైల్ వ్యాధులకు ఎలా చెక్ పెట్టాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook