Thyroid Control Tips: ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎదురౌతున్న మరో ప్రధాన సమస్య థైరాయిడ్. ప్రస్తుతం థైరాయిడ్ రోగుల సంఖ్య పెరుగుతోంది. అయితే కొన్ని ఫుడ్స్ ద్వారా థైరాయిడ్ నియంత్రణ సాధ్యమేనంటున్నారు వైద్య నిపుణులు..
ఆధునిక పోటీ ప్రపంచంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, ఆందోళన, జీవనశైలి కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. అందులో ప్రధానమైన స్థూలకాయం, కొలెస్ట్రాల్ గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. మరో ప్రధానమైన సమస్య థైరాయిడ్. థైరాయిడ్ రోగుల సంఖ్య కూడా ప్రస్తుతం క్రమంగా పెరుగుతున్న పరిస్థితి. థైరాయిడ్ కారణంగా డయాబెటిస్, స్థూలకాయం వంటి సమస్యలు తలెత్తుతాయి. అసలు థైరాయిడ్ అంటే ఏంటో చూద్దాం..
థైరాయిడ్ అంటే ఏమిటి
థైరాయిడ్ అనేది బటర్ ఫ్లై ఆకారంలో ఉండే ఒక గ్లాండ్. ఇది మనిషి శరీరంలోని గ్లాండ్స్‌లో కీలకమైంది. ఇది మెడ సమీపంలో ఉండి..బాడీ మెటబోలిజంను నడిపిస్తుంది. ఇంతటి కీలకమైన థైరాయిడ్ ఆరోగ్యంగా ఉంటే మనిషికి ఏ విధమైన అనారోగ్య సమస్యలు తలెత్తవు. వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ థైరాయిడ్ సమస్య వస్తుంటుంది.
థైరాయిడ్ నియంత్రణకు ఏం చేయాలి
అందుకే డైట్‌లో పోషక గుణాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు రోజూ తీసుకోవాలి. లైఫ్‌స్టైల్ కూడా మెరుగుపర్చుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా సూపర్ ఫుడ్స్ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరి ఆరోగ్యం కోసం చాలా మంచిది. థైరాయిడ్ ఆరోగ్యంగా ఉండేందుకు ఉసిరి చాలా ఉపయోగపడుతుంది. ఉసిరిలో ఆరెంజెస్ కంటే 8 రెట్లు, దానిమ్మతో పోలిస్తే 17 రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. ఇది థైరాయిడ్ ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. దాంతోపాటు విటమిన్ సి అనేది జుట్టుకు అద్భుతమైన టానిక్‌లా పనిచేస్తుంది. జుట్టు తెల్లబడకుండా నియంత్రిస్తుంది. దీనికోసం ఒక స్పూన్ ఉసిరి పౌడర్‌లో తేనె కలుపుకుని తీసుకోవాలి. లేదా ఉసిరి రసాన్ని రోజూ వేడి నీటితో ఉదయం పరగడుపున తీసుకోవాలి.
థైరాయిడ్ నియంత్రణకు అరటి పళ్లు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. అరటిలో ఉండే పుష్కలమైన పోషక పదార్ధాలు ధైరాయిడ్ నియంత్రణలో దోహదపడతాయి. ముఖ్యంగా విటమిన్ బి 6, విటమిన్ సి, డైటరీ ఫైబర్, మాంగనీస్‌లు థైరాయిడ్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి.
థైరాయిడ్ లక్షణాలు
థైరాయిడ్ ఉంటే క్రమంగా బరువు పెరగడం లేదా పూర్తిగా క్షీణించడం కన్పిస్తుంది. ఏ చిన్న పని చేసినా వెంటనే తీవ్రమైన అలసట వస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణ తప్పుతాయి. రోగ నిరోధక శక్తి తగ్గి..త్వరగా ఇన్‌ఫెక్షన్లు సోకుతుంటాయి.
Also read: Red Sandal Benefits: పింపుల్స్ నుంచి ఉపశమనం, అందం రెట్టింపు..ఎర్రచందనాన్ని ఇలా రాస్తే చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.