ఇటీవలి కాలంలో గుండెపోటు సమస్య తీవ్రమౌతోంది. కొన్ని సందర్భాల్లో ప్రాణలే పోతున్నాయి. మరీ ముఖ్యంగా గుండెపోటు వయస్సుతో నిమిత్తం లేకుండా వెంటాడుతోంది. చిన్న వయస్సుకే గుండెపోటు సమస్య రావడానికి కారణాలేంటో పరిశీలిద్దాం...
మనిషి ప్రాణం ఉందా లేదా అనేది గుండె చప్పుడుతోనే తెలుస్తుంది. ఆ చప్పుడు ఆగిందంటే ప్రాణం పోయినట్టే. అందుకే గుండెను ఎప్పుడూ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గుండె ఆరోగ్యంగా ఉన్నంతవరకూ గుండెపోటు సమస్య రాదు. ముఖ్యంగా డయాబెటిస్ రోగుల్లో గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుంది. చెడు ఆహారపు అలవాట్ల కారణంగానే గుండె సమస్యలైనా, డయాబెటిస్ ముప్పైనా తలెత్తుతుంది. రెండూ ఒకదానికొకటి ప్రభావితమై ఉంటాయి. డయాబెటిస్ రోగుల్లో బ్లడ్ షుగర్ స్థాయి సరిగ్గా లేకపోతే..బ్లడ్ ప్లెషర్ పెరుగుతుంది.
చిన్న వయస్సుకే గుండెపోటు సమస్య ఎందుకు
ప్రస్తుతం చాలామందిలో వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు సమస్య తలెత్తుతోంది. దీనికి కారణాలు చాలా ఉంటాయి. అందులో ప్రధానంగా డయాబెటిస్,చెడు ఆహారపు అలవాట్లు, రక్తపోటు ఉంటాయి. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే గుండెపోటు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. బ్లడ్ షుగర్ ఎక్కువైతే రక్తపోటుకు కారణమౌతుంది. అధిక రక్తపోటు గుండెపోటుకు దారితీస్తుంది.
కొలెస్ట్రాల్ కారణం
చెడు ఆహారపు అలవాట్ల కారణంగా 35 ఏళ్ల వయస్సుకే కొలెస్ట్రాల్ ప్రధాన సమస్యగా మారుతుంది. డయాబెటిస్ సమస్య లేకపోయినా..కొలెస్ట్రాల్ ఉంటే అది గుండెపోటుకు కారణం కాగలదు. కొలెస్ట్రాల్ నియంత్రణ చాలా అవసరం. మసాలా అధికంగా ఉన్న తిండికి దూరంగా ఉండాలి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే..బ్లడ్ క్లాట్స్ వచ్చి..హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తుంది.
మరో కారణం ఒత్తిడి. ఆధునిక జీవనశైలి, బిజీ ప్రపంచం కారణంగా చాలామంది 25-30 ఏళ్ల వయస్సు నుంచే తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు. ఫలితంగా మనకు తెలియకుండానే బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితుల్లో స్మోకింగ్, మద్యం అలవాట్లుంటే గుండెపోటు సమస్య అధికమౌతుంది. డయాబెటిస్ ఉన్నప్పుడు గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోవాలంటే..బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండాలి. శరీర బరువు కూడా అదుపులో ఉండాలి. పరిమితంగా వ్యాయామం చేయాలి. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రయత్నించాలి. వ్యాయామం కూడా మితంగా ఉండాల్సిన అవసరముంది.
Also read: Bath Precautions: స్నానం చేసేటప్పుడు ఆ పొరపాటు చేస్తే...స్కిన్ కేన్సర్ ముప్పు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook