Kiwi Benefits: రోజుకో ఫ్రూట్ తీసుకుంటే చాలు..అన్ని రోగాలు మాయం, చర్మానికి నిగారింపు

Kiwi Benefits: మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా ఉండాల్సింది ఆరోగ్యకరమైన ఆహరం. హెల్తీ ఫుడ్ అంటే వెంటనే గుర్తొచ్చేది పండ్లు. ప్రకృతిలో చాలా రకాల పండ్లు విరివిగా లభిస్తుంటాయి. ఇందులో ఏది అత్యుత్తమమైందో తెలుసుకోవాలి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 11, 2023, 07:18 PM IST
Kiwi Benefits: రోజుకో ఫ్రూట్ తీసుకుంటే చాలు..అన్ని రోగాలు మాయం, చర్మానికి నిగారింపు

Kiwi Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో అత్యద్భుతమైంది కివీ. చిన్నగా బ్రౌన్ కలర్‌లో ఉండే కివీ లోపలి భాగం ఆకుపచ్చగా ఉంటుంది. కివీని ఆరోగ్యపరంగానే కాకుండా సౌందర్య పరిరక్షణకు సైతం వినియోగిస్తుంటారు. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం..

కివీ ఫ్రూట్ రుచి చాలా విభిన్నంగా ఉంటుంది. అదే సమయంలో అందరినీ ఆకట్టుకుంటుంది. శరీరానికి ఆరోగ్యపరంగా ఈ ఫ్రూట్ వల్ల అమితమైన లాభాలున్నాయి. ఏడాది పొడుగునా మార్కెట్‌లో లభించే అన్‌సీజనల్ ఫ్రూట్ ఇది. కివీని సూపర్‌ఫుడ్ కేటగరీగా పరిగణిస్తారు. ఇందులో పుష్కలంగా లభించే న్యూట్రియంట్లు ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. మార్కెట్‌లో లభించే ఇతర పండ్లతో పోలిస్తే దీని ధర ఎక్కువే. కానీ ప్రతి రోజూ తినడం వల్ల కలిగే ప్రయోజనాలతో పోలిస్తే ఆ ధర తక్కువే అన్పిస్తుంది. ఆరోగ్యానికి ఎంత వరకూ మంచిదనేది వివరంగా తెలుసుకుందాం..

కివీ ఫ్రూట్‌లో కేలరీల పరిమాణం తక్కువగా ఉండటం వల్ల ఫిట్‌నెస్ కోసం అద్బుతంగా ఉపయోగపడుతుంది. ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలనుకునేవారు కివీ ఫ్రూట్స్ తప్పకుండా తినాలి. ఇందులో పొటాషియం, విటమిన్ సి , ఫైబర్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి శరీరానికి వివిధ రకాలుగా ఆరోగ్యాన్ని అందిస్తాయి. రోజుకు ఒక మీడియం సైజ్ కివీ తినడం ఆరోగ్యానికి సర్వ విధాలుగా మంచిది.

1. గుండె వ్యాధి గ్రస్థులకు కివీ ఫ్రూట్ చాలా మంచిది. రోజూ ఒక కివీ ఫ్రూట్ తీసుకోవడం వల్ల గుండె వ్యాధి ముప్పు తగ్గుతుంది. 

2. కివీ శరీరం ఇమ్యూనిటీని వేగంగా పెంచుతుంది. ఫలితంగా చాలా వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.

3. కివీ ఫ్రూట్ తింటే ఎముకలు బలంగా మారుతాయి. జాయింట్ పెయిన్స్ తగ్గించుకోవచ్చు.

4. మానసిక సమస్యలతో సతమతమయ్యేవారికి ఒత్తిడి తగ్గించేందుకు కివీ ఫ్రూట్స్ అవసరమౌతాయి.

5. కివీలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పెద్దమొత్తంలో ఉండటం వల్ల గర్భిణీ మహిళలకు చాలా మంచిది

6. కడుపు సంబంధిత సమస్యలుండేవారికి కివీ ఫ్రూట్ నిర్ణీత మోతాదులో తీసుకోవడం మంచి లాభాల్ని ఆర్జిస్తుంది.

7. కివీ ఫ్రూట్‌లో కడుపులో ఏర్పడే అల్సర్స్‌ని తగ్గిస్తుంది.  అదే విధంగా అధిక రక్తపోటు సమస్య ఉండేవారు తప్పకుండా తినాలి. దీనివల్ల బీపీ నియంత్రణలో ఉంటాయి.

8. కివీ ఫ్రూట్స్‌లో కేలరీలు తక్కువ అయినందున డయాబెటిస్ రోగులకు ఔషధం లాంటిది.

9. కివీ ఫ్రూట్స్ రోజూ తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఆ ప్రభావం చర్మంపై కచ్తితంగా కన్పిస్తుంది. చర్మానికి నిగారింపు వస్తుంది.

10. కివీని నిర్ణీత పద్ధతిలో సేవిస్తే చర్మంపై అద్భుతమైన నిగారింపు కన్పిస్తుంది. ముఖంపై ముడతలు కూడా మాయమౌతాయి.

Also read: Cholesterol Tips: రక్త నాళాలపై దుష్ప్రభావం చూపే కొలెస్ట్రాల్, ఎలా తగ్గించుకోవాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News