Green Tea Vs Black Coffee: గ్రీన్ టీ, బ్లాక్ టీ మధ్య తేడాలు తెలుసా.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే..?

Green Tea and Black Coffee Benefits: గ్రీన్ టీ, బ్లాక్ టీ ఏది బెటర్..? దేనిలో కెఫిన్ పరిణామం ఎక్కువగా ఉంటుంది..? ఏది తాగితే మన ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. గ్రీన్ టీ, బ్లాక్ టీ గురించి అధ్యయనాలు ఏం చెబుతున్నాయి..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2023, 08:17 AM IST
Green Tea Vs Black Coffee: గ్రీన్ టీ, బ్లాక్ టీ మధ్య తేడాలు తెలుసా.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే..?

Green Tea and Black Coffee Benefits: ప్రస్తుతం మారుతున్న ఆహారపు అలవాట్లు ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో చాలా మంది గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ వంటివి తాగుతూ.. కొంతవరకు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఈ రెండు ఆరోగ్యానికి మేలు చేకుర్చివే.. అయితే ఈ రెండింటిలో ఏది బెటర్..? అని చాలా మందిలో ఓ డౌట్ ఉంది. ఈ విషయంపై 2013లో యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌ పరిశోధన చేసింది. గ్రీన్ టీ , బ్లాక్ కాఫీ గ్లూకోజ్ మెటబాలిజం , యాంటీఆక్సిడెంట్ స్టాటస్‌పై పరిశోధన చేసి వివరాలు వెల్లడించింది.

గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ క్రమం తప్పకుండా తీసుకుంటే.. రెండూ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుస్తాయని పరిశోధనలో తేలింది. బ్లాక్ టీతో పోలిస్తే.. గ్రీన్ టీలో కొంచెం మెరుగైన ఫలితాలు కనిపించాయి. రక్తంలో షుగర్ లెవల్స్‌ను నిర్వహించడంలో గ్రీన్‌ టీ కాస్త మెరుగ్గా పనిచేసింది. రక్తప్రవాహంలో యాంటీఆక్సిడెంట్ సామర్థ్యంపై కూడా గ్రీన్ టీ ప్రభావం కొంచెం ఎక్కువగా ఉన్నట్లు రిపోర్ట్‌లో వెల్లడైంది.

గ్రీన్ టీ ఎలా తయారు చేస్తారంటే..?

గ్రీన్‌ టీను కామెల్లియా సినెన్సిస్ మొక్క ఆకుల నుంచి తయారుచేస్తారు. ఇందులో కాటెచిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఒక రకమైన యాంటీఆక్సిడెంట్. గ్లూకోజ్ జీవక్రియ ప్రయోజనాలతో పాటు గ్రీన్ టీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సాయం పడుతుంది. బరువు తగ్గేందుకు కూడా గ్రీన్ టీ ఎంతో సాయపడుతుంది. గ్రీన్ టీలో కెఫిన్, ఎల్-థియానిన్ ఉండడంతో మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. గ్రీన్ టీని రోజూ తీసుకుంటే.. మూత్రవిసర్జన సమస్యలు కూడా ఉండవు.

బ్లాక్ కాఫీ ఎలా తయారు చేస్తారంటే..?

బ్లాక్ కాఫీని కాల్చిన కాఫీ గింజల నుంచి తయారుచేస్తారు. బ్లాక్ కాఫీలో ఉండే కెఫీన్ యాక్టివ్‌గా ఉంచడంలోనూ.. అలసటను తగ్గించడంలోనూ సహాయ పడుతుంది. బ్లాక్ కాఫీని క్రమం తప్పకుండా తీసుకుంటే.. నాడీ సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి. కాఫీలో ఉండే కెఫిన్ జీవక్రియను పెంచడంతోపాటు ఆకలిని అణచివేసి బరువు తగ్గడంలో దోహదపడుతుందని పరిశోధనలో వెల్లడైంది.

గ్రీన్ టీ కంటే బ్లాక్ కాఫీలో కెఫిన్ పరిణామం ఎక్కువగా ఉంటుంది. ఇన్‌స్టంట్ ఎనర్జీ కావాలనుకునేవారికి ఇది సరైన ఎంపిక. అయితే కెఫిన్ వద్దనుకునేవారికి గ్రీన్ టీ బెటర్ ఆప్షన్. గ్రీన్ టీలో కూడా కెఫీన్ ఉంటుంది. అయితే సాధారణంగా కాఫీ కంటే తక్కువగా ఉంటుంది. మీరు కెఫిన్ తీసుకోవడం తగ్గించాలనుకుంటే గ్రీన్‌ టీ తాగడం ఉత్తమం. 

Also Read: Minor Sisters Killed: ప్రియుడితో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన అక్క.. చెల్లెళ్లు చూశారని దారుణం..!  

Also Read: World Cup 2023 Points Table: టాప్ ప్లేస్‌కు దూసుకువచ్చిన సఫారీ.. టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News