Garlic Peels Benefits: వెల్లుల్లిని సాధారణంగా వంటల్లో వినియోగిస్తారు. భారతీయ వంటల్లో వెల్లుల్లి తప్పకుండా ఉంటుంది. వంటల్లో రుచికోసమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా వెల్లుల్లితో చాలా ప్రయోజనాలున్నాయి. అందుకే ఆయుర్వేద వైద్య విధానంలో వెల్లుల్లి పాత్ర కీలకం. అయితే వెల్లుల్లి తొక్కలు కూడా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు అందిస్తుందనే విషయం చాలా మందికి తెలియదు.
ఆయుర్వేదపరంగా అద్బుతమైందిగా భావించే వెల్లుల్లిని అనాదిగా వంటల్లో రుచి కోసం వాడుతుంటారు. కేవలం రుచి కోసమే కాకుండా ఆరోగ్యపరంగా చాలా లాభదాయకమైంది. వెల్లుల్లిలో ఔషధ గుణాలెక్కువ. వెల్లుల్లి తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, ఫ్లెవనాయిడ్స్ ఇతర పదార్ధాలు చాలా ఎక్కువగా ఉంటాయి. శరీరం ఎదుర్కొనే చాలా వ్యాధుల్నించి రక్షణ కల్పిస్తుంది. ఈ విషయం తెలియక చాలామంది వెల్లుల్లి తొక్కల్ని పడేస్తుంటారు. ఆరోగ్యానికి మేలు చేకూర్చే ప్రయోజనాలు వెల్లుల్లి తొక్కల్లో చాలా ఉన్నాయి.
వెల్లుల్లి తొక్కలతో ప్రయోజనాలు
వెల్లుల్లి తొక్కల్లో ఉండే సల్ఫర్ కారణంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. శరీరం నుంచి విష పదార్ధాలు బయటకు విసర్జించేందుకు దోహదపడుతుంది. వెల్లుల్లి తొక్కల్లో యాక్టివ్ ఫ్లెవనాయిడ్స్, క్వెర్‌సెటిన్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించవచ్చు. గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వెల్లుల్లి తొక్కలు తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. రక్తంలో గడ్డకట్టకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం.
వెల్లుల్లి తొక్కల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ కణాలను నియంత్రిస్తాయి. వెల్లుల్లితో తయారు చేసే కాడా చర్మం మంట, స్వెల్లింగ్ తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. వెల్లులి తొక్కలతో చేసే ఆయిల్ కూడా చాలా మంచిది. కేశాలను పటిష్టం చేస్తుంది.
వెల్లుల్లి తొక్కల్ని నీటిలో ఉడకబెట్టి టీ తయారు చేయవచ్చు. ఈ టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. వెల్లుల్లి తొక్కల్ని నూనెలో ఉడకబెట్టి ఆయిల్ చేయవచ్చు. ఈ ఆయిల్ చర్మానికి, కేశాలకు చాలా మంచిది. వెల్లుల్లి తొక్కలతో సూప్ తయారు చేసుకుని తాగవచ్చు. వెల్లుల్లి తొక్కలతో ఆయుర్వేదపరంగా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి.
Also read: Breakfast Benefits: బ్రేక్‌ఫాస్ట్ ఎందుకు స్కిప్ చేయకూడదు, కలిగే లాభాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook