Saunf Remedies: చాలామందికి సోంపుతో కలిగే పూర్తి ప్రయోజనాలు తెలియవు. సోంపును కేవలం ఒక మౌత్ ఫ్రెష్‌నర్‌గా మాత్రమే వినియోగిస్తుంటారు. కానీ క్రమం తప్పకుండా సోంపు తినడం అలవాటు చేసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రోజూ భోజనం తరువాత సోంపు తింటే 4 సమస్యలకు చెక్ చెప్పవచ్చంటున్నారు వైద్య నిపుణులు.
సోంపు కేవలం రుచి, సువాసన కోసమే కాకుండా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు కలిగి ఉంటుంది. మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేందుకు సోంపు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు సైతం సోంపు తినమని సూచిస్తుంటారు. మనం తినే ఆహారం ఏ మేరకు, ఎలా జీర్ణం అవుతుందనేదానిపై ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే జీర్ణ వ్యవస్థ చాలా కీలకమైందిగా పరిగణిస్తారు. జీర్ణక్రియకు దోహదపడే అంశాల్లో గ్రంధులు, లివర్, చిన్న పెద్ద ప్రేవులు కీలకమైనవి. వీటిలో ఏ మాత్రం సమస్య ఉన్నా బ్లోటింగ్, ఎసిడిటీ, కడుపు నొప్పి సమస్యలు తలెత్తుతాయి. అందుకే వైద్యులు భోజనం తరువాత సోంపు నమలమని సూచిస్తుంటారు. సోంపు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా శ్వాస తాజాగా ఉంటుంది.
రోజూ క్రమం తప్పకుండా భోజనం తరువాత కొద్దిగా సోంపు నమిలి తినడం అలవాటు చేసుకుంటే కడుపులో నొప్పి సమస్య ఉత్పన్నం కాదు. సోంపు తినడం వల్ల కడుపు కండరాలు రిలాక్స్ అవుతాయి. ఆహారాన్ని సరిగ్గా ప్రోసెస్ చేస్తుంది. అంతేకాకుండా బ్లోటింగ్ సమస్యను నివారిస్తుంది. ఎప్పుడైనా ఎక్కువ తిన్నప్పుడు బ్లోటింగ్ సమస్య సహజం. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే భోజనం తరువాత సోపు తింటే సులభంగా జీర్ణమౌతుంది. సోంపు తినడం వల్ల డైజెస్టివ్ ఎంజైమ్ విడుదలవుతుంది.
భోజనం తరువాత సోంపు తినడం వల్ల ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే అల్కలైన్ పీహెచ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దాంతో హార్ట్ బర్న్ సమస్య కూడా ఉండదు. ఇక అందరికీ తెలిసింది నోటి దుర్వాసన పోగొట్టడం. సోంపు తినడం వల్ల నోట్లోంచి వచ్చే దుర్వాసన అరికట్టవచ్చు. సోంపు అనేది సహజసిద్ధమైన మౌత్ ఫ్రెష్‌నర్.
Also read: Heart Attack Risk: కుటుంబంలో హార్ట్ ఎటాక్స్ ఉన్నాయా, అయితే ఈ 5 అలవాట్లకు దూరం తప్పదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి