Egg Cholesterol Relation: ప్రతి రోజు ఉడికించిన గుడ్లు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ప్రోటీన్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని తినడం వల్ల అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఉడికించిన గుడ్లను సూపర్‌ఫుడ్‌గా భావిస్తారు. ప్రస్తుతం చాలా మంది కొన్ని అపోహలు ఉన్నాయి. ఉడికించి గుడ్లను ప్రతి రోజు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరుగుతాయని అంటూ ఉంటారు. ఇలా గుడ్లను ప్రతి రోజు తినడం వల్ల నిజంగానే శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరుగుతాయా.? దీనికి సంబంధించిన మరింత సమచారం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉడికించి గుడ్లు ప్రతి రోజు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా?:
గుడ్లలో అనారోగ్యానికి మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ అధిక పరిమాణంలో లభిస్తుంది. దీని కారణంగా శరీరంలో కణాల సంఖ్యను పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి వీటిని తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అస్సలు పెరగదు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. ఈ గుడ్లతో వెన్నను తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది.
Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్ జాయ్ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?
గుడ్లు రోజుకు ఎన్ని తినాలో తెలుసా?:
ప్రతి రోజు ఉడికించిన గుడ్లను తినడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య నిపుణులు సూచించి వివరాల ప్రకారం.. రోజుకు 2 గుడ్లు తింటే శరీరానికి ప్రయోజనాలు కలుగుతాయి. 2 కంటే ఎక్కువగా తినాలనుకునేవారు తప్పకుండా వైద్యులను సంప్రదించి తినాల్సి ఉంటుంది. గుడ్లను అతిగా తినేవారు తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారాలు ఇవే:
రెడ్ మీట్:
ప్రోటీన్ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి దీనిని అతిగా తినడం మానుకోవాల్సి ఉంటుంది.
ఫుల్ ఫ్యాట్ మిల్క్:
ఈ పాలను అతిగా తాగడం వల్ల కూడా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్ జాయ్ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి