Remedies for Low Blood Pressure: లో బ్లడ్ ప్రెషర్ తగ్గించే పవర్ ఫుల్ హోమ్ రెమెడీస్

మీకు లో బ్లడ్ ప్రెషర్ ఉందా.. ?? అయితే ఏం టెన్షన్ పడకండి.. ఇక్కడ ఉన్న పద్దతులను పాటిస్తూ, ఆహార పదార్థాలను తీసుకుంటే.. లో బ్లడ్ ప్రెషర్ నుండి సహాజంగా ఉపశమనం పొందవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2021, 07:16 PM IST
  • పచ్చి బీట్ రూట్ రసం లో బ్లడ్ ప్రెషర్ మంచి ఔషదంగా చెప్పవచ్చు
  • బలహీనంగా లేదా మైకంగా అనిపించినపుడు, పాలు కలపని కాఫీ తాగండి
  • బ్లడ్ ప్రెషర్ సాధారణ స్థితికి చేరే వరకు ఉప్పు ఎక్కువగా ఉన్న వాటిని తినండి
  • రోజు సైక్లింగ్, వాకింగ్ లేదా యోగ వంటి చిన్న చిన్న వ్యాయమలను చేయండి
Remedies for Low Blood Pressure: లో బ్లడ్ ప్రెషర్ తగ్గించే పవర్ ఫుల్ హోమ్ రెమెడీస్

Remedies for Low Blood Pressure: హై  అండ్ లో బ్లడ్ ప్రెషర్ ఎలాంటి లక్షణాలను బహిర్గతపరచకుండా వస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా, చాలా మంది దీనితో భాదపడుతున్నారు. తరచుగా జ్వరం రావటం లేదా బలహీనంగా అనిపిస్తే, కారణం బ్లడ్ ప్రెషర్ సమస్యలు అని చెప్పవచ్చు. రెండింటిలో లో బ్లడ్ ప్రెషర్ చాలా ప్రమాదకర పరిస్థితిగా పేర్కొనవచ్చు, ఎందుకంటే దీని వలన మెదడుకు ఆక్సిజన్ మరియు అవసరమైన పోషకాల సరఫరా ఆగిపోయి, చాలా ప్రమాదకర పరిస్థితులను ఏర్పరుస్తుంది. కావున పరిస్థితిని విస్మరించకుండా, తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. కొన్ని రకాల ఇంట్లో ఉండే ఔషదాలు మరియు ఆహార పదార్థాలను క్రమంగా తినటం వలన లో బ్లడ్ ప్రెషర్ నుండి కోలుకోవచ్చు. 

బీట్ రూట్
లో బ్లడ్ ప్రెషర్ ను తగ్గించే శక్తివంతమైన ఔషదంగా పచ్చి బీట్ రూట్ రసాన్ని చెప్పవచ్చు. లో బ్లడ్ ప్రెషర్ చే ఇబ్బందిపడే వారు, రోజు కనీసం రెండు గ్లాసుల బీట్ రూట్ రసాన్ని తాగటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇలా రోజు తాగితే వారంలోనే మార్పులను గమనిస్తారు.

బ్లాక్ కాఫీ
బ్లాక్ కాఫీ కూడా లో బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తుంది. లో బ్లడ్ ప్రెషర్ వలన అలసటగా, బలహీనంగా మారతారు. ఇలాంటి సమయంలో పాలు కలపని బ్లాక్ కాఫీ తాగటం తాగితే అలసట నుండి త్వరగా  ఉపశమనం పొందవచ్చు.

Also Read: The Baap Of All Talk Shows: బాలకృష్ణ టాక్ షోపై కీలక ప్రకటన చేయనున్న అల్లుఅరవింద్

ఉప్పు
లో బ్లడ్ ప్రెషర్ ను కలిగి ఉన్న రోగి యొక్క బ్లడ్ ప్రెషర్ స్థాయిలు సాధారణ స్థితికి చేరే వరకు, అతడి/ఆమె ఆహారంలో ఉప్పు ఆధారిత ఆహారాలను పెంచాలి. వీటితో పాటుగా మందులను కూడా వాడాలి. అంతేకాకుండా, ఉప్పు ఆధారిత ఆహార పదార్థాలతో పాటుగా, ఒక గ్లాసు ఉప్పు నీటిని కూడా తాగాలి. 

తేలికైన వ్యాయామాలు
లో బ్లడ్ ప్రెషర్ చే సమస్యలను ఎదుర్కొనే వారు, వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ మరియు యోగ వంటి తేలికైన వ్యాయామాలను రోజు అనుసరించాలి. అంతేకాకుండా, వీరు సన్ అండ్ ఎయిర్ బాత్ లను కూడా చేయాలి. వీటితో పాటుగా ఎక్కువ సమయం బయట అనగా, ఫ్రెష్ ఎయిర్ లో గడపాలి.

పాలు & బాదం

7 బాదం పప్పులను ఒక కప్పు నీటిలో ఉంచి, పూర్తి రాత్రి నానబెట్టాలి. తరువాత ఉదయం, బాదం పప్పుపై ఉన్న తోలును తీసివేసి, పేస్ట్ లా దంచండి. ఈ పేస్ట్ ను గోరు వెచ్చని పాలలో కలుపుకొని తాగటం వలన మంచి ఫలితాలను పొందుతారు.  

Also Read: T20 World Cup 2021: కొత్త జెర్సీలతో టీమిండియా.. క్షణాల్లో వైరల్ అయిన పోస్ట్

పవిత్ర తులసీ
10 తులసీ ఆకులను తీసుకొని, దంచండి. తరువాత పలుచని గుడ్డ సహాయంతో, ఈ మిశ్రమాన్ని వడపోయండి. ఇలా వడపోసిన మిశ్రమాన్ని, ఒక చెంచా తేనెతో కలిపి, రోజు ఉదయాన పరగడుపున తీసుకోండి. తేనె కలపటం వలన దీని ప్రభావం మరింత రెట్టింపవుతుంది. 

ఎండుద్రాక్షలు
30 ఎండుద్రాక్షలను తీసుకొని, గిన్నెలో వేసి, పూర్తి రాత్రి నానబెట్టండి. ఉదయాన, ఖాళీ కడుపుతో వీటిని తినండి. తరువాత ఒక గ్లాసు నీటిని తాగండి. ఇలా వారానికి 2 నుండి 3 సార్లు చేయటం వలన మంచి అల్ప రక్తపోటు నుండి తక్కువ సమయంలో ఉపశమనం పొందుతారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News