Early Puberty: అకాల యుక్త వయస్సు రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. పిల్లలకు వీటిని అస్సలు ఇవ్వదు!

Foods That Trigger Early Puberty in Children: ప్రస్తుతం చాలామంది చిన్న పిల్లల్లో తొందరగా యుక్త వయసు వస్తోంది. దీనికి కారణంగా చిన్న వయసులోనే ఎంతో పెద్దవారిగా కనిపిస్తున్నారు. అయితే తొందరగా యుక్త వయసు రాకుండా ఉండడానికి ప్రతి రోజు పిల్లలకు ఈ ఆహారాలను ఇవ్వడం మానుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 24, 2024, 09:27 PM IST
 Early Puberty: అకాల యుక్త వయస్సు రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. పిల్లలకు వీటిని అస్సలు ఇవ్వదు!

 

Foods That Trigger Early Puberty in Children: ఎవరి పిల్లలైనా కాలంతో పాటు పెరుగుతూ ఉంటారు. ఎప్పటికీ చిన్నపిల్లల్లాగా ఉండకుండా వారిలో ఉండే ప్రతి అవయవం కాలక్రమమైన పెరుగుతూ ఉంటుంది. అందరిలో మెదడు అభివృద్ధి చెందడమే కాకుండా శరీర ఎత్తు, శరీరంపై అనేక మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు యుక్త వయసులోకి రాగానే మరిన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఈ యుక్త వయసు అనేది మగ ఆడవారిలో వివిధ సంవత్సరాల్లో వస్తూ ఉంటుంది. మగవారిలో యుక్త వయసు 9 నుంచి 14 సంవత్సరాల మధ్య ప్రారంభమైతే ఆడవాళ్లలో మాత్రం 8 నుంచి 13 సంవత్సరాల మధ్య మొదలవుతుంది. ఇదిలా ఉంటే ఆధునిక జీవనశైలి అనారోగ్యకరమైన ఆహార అలవాట్ల కారణంగా చాలామంది పిల్లలు యుక్త వయసు కంటే ముందే శరీరంలో అనేకమార్లు వస్తున్నాయి అంతేకాకుండా చాలామందిలో అకాల యుక్త వయస్సు సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. నిజానికి అకాలయుక్త వయసు అనేక కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది కారణమైతే రెండవది హార్మోన్ సమస్యగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యుక్త వయసును తొందరగా ప్రభావితం చేసి కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్యాకేజ్ చేసిన ఆహారాలు:
చాలామంది ఫుడ్ మార్కెట్స్ లో లేదా సూపర్ మార్కెట్లలో ప్యాకేజ్ చేసిన కొవ్వుతో కూడిన అనారోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల హార్మోన్ల సమతుల్యంలో అనేక మార్పులు వచ్చి త్వరగా యుక్త వయసుకు కారణమవుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు:
చాలామందిలో చెక్కర ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా తొందరగా యుక్త వయసు వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలోని ఇన్సులిన్ ప్రభావితమై అనేక హార్మోన్ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి చెక్కరదిగా ఉండే ఆహారాలను తీసుకోకపోవడం ఎంతో మంచిది. 

సోయా ఆహార పదార్థాలు:
సోయా అధిక మోతాదులో లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా శరీరంలోని ప్రోటీన్ అధిక మోతాదులో పెరిగిపోయి. ఈస్ట్రోజన్ వంటి సమ్మేళనాలను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవి అతిగా విడుదల కావడం కారణంగా చాలామందిలో యుక్త వయసు తొందరగా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ తినడం:
ప్రస్తుతం చాలామంది పిల్లలకు ఫాస్ట్ ఫుడ్స్ ను కూడా ఎక్కువగా తినిపిస్తున్నారు. నిజానికి వీటిని తినిపించడం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు హార్మోన్లు దెబ్బ తినే అవకాశాలున్నాయి. దీంతో సులభంగా యుక్త వయస్సు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే పై ఆహారాలకు తప్పకుండా దూరంగా ఉండటం చాలా మేలు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News