Dry Fruits Eating Tips: శరీర అభివృద్ధికి డ్రై ఫ్రూట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో పోషక విలువలు అధికంగా ఉండడం వల్ల శరీరానికి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వీటిని వివిధ రకాలుగా తింటూ ఉంటారు. కొందరు నీటిలో నానబెట్టుకుని తింటే మరి కొందరు స్వీట్స్‌లలో వేసుకుని తింటారు. అయితే వీటిని నానబెట్టుకుని తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టి తినడం వల్ల వచ్చే వివిధ రకాల ప్రయోజనాలను తెలుసుకుందాం..
డ్రై ఫ్రూట్స్‌ను ఎలా తినడం మేలు.? (How To Eat Dry Fruits):
డ్రై ఫ్రూట్స్‌ను కొన్ని పచ్చిగాను , మరికొన్నింటిని నీటిలో నానబెట్టి తినాలని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పిస్తా, జీడిపప్పు, ఖర్జూర వంటి వాటిని నీటిలో నానబెట్టకుండా తినడం మంచిదని..ఎండుద్రాక్ష, బాదం వంటి డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టి తినవచ్చని పేర్కొన్నారు.
నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు (Soaked Dry Fruits Eating Benefits):
1. మనం తరచుగా నానబెట్టిన బాదంపప్పులను తింటూ ఉంటాము. అయితే అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా మందికి తెలియదు. బాదం పప్పులో టానిన్ ఉంటుంది. ఇది పోషకాలను గ్రహించడాన్ని నిరోధిస్తుంది. కావున ఇది నానబెట్టి తినే క్రమంలో దాని పై తొక్క విడిపోతుంది.
2. ఎండుద్రాక్షను సాధారణంగా నేరుగా తింటారు. కానీ దీనిని నానబెట్టి తింటే.. అందులో ఉండే హానికరమైన ప్రిజర్వేటివ్‌లు తొలగిపోయి. శరీరానికి మంచి లాభాలను చేకూర్చుతుంది.
3. నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల వాటిలో ఉండే ఫైటిక్ యాసిడ్ తగ్గి సులభంగా జీర్ణమవుతుంది.
4. వాల్ నట్స్, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ శరీరానికి వేడిని పుట్టిస్తాయి. ఇది వేసవి కాలంలో శరీరానికి నష్టాన్ని కలిగిస్తుంది. నీటిలో నానబెట్టి తినడం ద్వారా శరీరానికి చలవ చేస్తుంది.
5. డ్రై ఫ్రూట్స్‌ను కొన్ని రోజులు నానబెట్టితే..అవి మొలకెత్తడం ప్రారంభమవుతాయి. దీని కారణంగా వాటిలో పోషక విలువలు పెరుగుతాయి.
6. నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల దాని రుచి పెరిగి..దానిలో నీటి శాతం కూడా పెరుగుతుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Clove Oil Benefits: లవంగాల నూనెతో మగవారికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
Also Read: Mushroom Benefits: పుట్టగొడుగుల వల్ల చర్మాని ఇన్ని లాభాలా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి