Diabetes Control: తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండేందుకు చిట్కా..

Diabetes Control: డయాబెటిస్ ప్రాణాంతక ఆరోగ్య సమస్య మన దేశంలో సగానికి పైగా డయాబెటిస్తో  బాధపడుతున్నారు. డయాబెటిస్ రక్తంలో చక్కరలు అదుపులో ఉండకపోవటం వల్ల వస్తుంది.

Written by - Renuka Godugu | Last Updated : May 29, 2024, 06:46 PM IST
Diabetes Control: తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండేందుకు చిట్కా..

Diabetes Control: డయాబెటిస్ ప్రాణాంతక ఆరోగ్య సమస్య మన దేశంలో సగానికి పైగా డయాబెటిస్తో  బాధపడుతున్నారు. డయాబెటిస్ రక్తంలో చక్కరలు అదుపులో ఉండకపోవటం వల్ల వస్తుంది. మనం తీసుకునే ఆహారం సరైన జీవనశైలి అనుసరించడం వల్ల డయాబెటిస్ నిర్వహణలో ఉంటుంది సమతుల ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసే ఆహారాలు తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలని పెంచే ఆహారాలు జోలికి వెళ్ళకూడదు. అయితే తిన్నాక రక్తంలో చక్కెర స్థాయిలు పెరగనివ్వని కొన్ని ఆహారాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం..

డయాబెటిస్‌ ఉన్నవారు రక్తంలో చక్కెర హఠాత్తుగా పెరగకూడదంటే ఆహారం తీసుకోవటం ముందుగా గంజి పదార్థాలు లేని ఆహారాలతో భోజనం ప్రారంభించాలి. ముఖ్యంగా గంజి లేని ఆకుకూరలు, బ్రోకోలి, బెల్ పెప్పర్స్ వంటివి డైట్లో చేర్చుకోవాలి. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెరగనివ్వవు.

డయాబెటిస్ రోగులు తినే ఆహారంలో పప్పులు అధిక శాతం ఉండేలా తీసుకోవాలి. చికెన్, తోఫు, చేపలు వంటివి డైట్లో చేర్చుకోవాలి. ప్రోటీన్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉండేలా చూస్తాయి కడుపులో ఎక్కువ శాతం ఆకలి అవ్వనివ్వదు.

ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలు డైట్లో చేర్చుకోవాలి. ముఖ్యంగా అవకాడో, గింజలు డైట్లో ఉండేలా చూసుకోవాలి. ఇది గ్లూకోజ్ గ్రహించడాన్ని నియంత్రిస్తుంది.

అంతే కాదు మీ భోజనంలో తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్స్, బ్రౌన్ రైస్ వంటివి ఉండాలి ఇందులో గ్లైసెమిక్ సూచి తక్కువగా ఉంటుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ మెల్లిగా విడుదల చేస్తాయి.

ఇదీ చదవండి: పసుపుపాలు లేదా పసుపునీరు రెండిటిలో శరీరానికి ఏది ఎక్కువ ప్రయోజనాలు ఇస్తుంది..

 డయాబెటిస్ రోగులు తీసుకునే ఆహారంలో నీటి శాతం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఇవి రోజంతటి కావలసిన హైడ్రేషన్ అందిస్తుంది. మంచి జీర్ణ క్రియ కూడా ప్రోత్సహిస్తుంది. డీహైడ్రేషన్ కి గురికాకుండా కంట్రోల్ చేస్తుంది.

రక్తంలో చక్కెర అధిక స్థాయిలతో బాధపడేవారు ఆహారం తీసుకునేటప్పుడు అతిగా తినకూడదు. తక్కువ మోతాదులో ఎక్కువ శాతం తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో ఒకేసారి ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగిపోతాయి. తీసుకునే ఆహారంలో కార్బొహైడ్రేట్స్ కూడా తక్కువ మోతాదులో ఉండే తీసుకోవాలి.

ఇదీ చదవండి: అరటి పండ్లతో మీ గుండె పదికాలలాపాటు పదిలం.. ఎలానో తెలుసా?

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రీకు యోగర్ట్, బెర్రీలు వంటివి చేర్చుకోవాలి చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెరగనివ్వవు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News